breakingnews : టీడీపీ అభ్యర్థిపై వేటకొడవళ్లతో దాడి చేసిన వైసిపి నాయకులూ.. షాక్ లో చంద్రబాబు..

224

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై అధికార టీడీపీ, వైసీపీలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇందులో టీడీపీ పాత్ర ఉందంటూ వైసీపీ నేతలంటే, జగన్ కుటుంబంలో గొడవల వల్లే వివేకాను హత్య చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల వేళ ఈ హత్యోందంతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇలా ఉండగా ఇప్పుడు వైసీపీ మరియు టిడిపి మధ్య మరొక యుద్ధం మొదలయ్యే ఘటన జరిగింది. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మీద వైసిపి వాళ్ళు దాడి చేశారు.

Image result for tikka reddy

కర్నూలులో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు పడగవిప్పాయి. శనివారం కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడిచేశారు. ఈ క్రమంలో గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రమాదవశాత్తూ తిక్కడారెడ్డి సహా ఏఎస్‌ఐ గాయపడ్డారు. మంత్రాలయం మండలం ఖగ్గలు గ్రామంలో శనివారం టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి జెండా ఆవిష్కరణ అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి భార్య జయమ్మ, ప్రదీప్ రెడ్డి తమ అనుచరులతో కలిసి అక్కడకు చేరుకుని టీడీపీ జెండాను తొలగించి వారితో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రింది వీడియో చూడండి 

వైసీపీకి పట్టున్న గ్రామమైన ఖగ్గల్‌లో టీడీపీ జెండా ఆవిష్కరించడంతో బాలనాగిరెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఇది కాస్తా ముదిరి పరిస్థితి విషమించడంతో తిక్కారెడ్డి వర్గంపై వేటకొడవళ్లతో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి రణరంగంగా మారి అదుపు తప్పడంతో గన్‌మెన్ కాల్పులు జరిపారు. నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ దాడిలో తిప్పారెడ్డితో పాటు మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కాళ్లలో బుల్లెట్లు దూసుకుపోయాయి. గాయపడిన వీరిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. చూడాలి మరి ఈ ఘటన మీద ఒకరి మీద ఒకరు ఎలా ఆరోపణలు చేసుకుంటారో. మరి టీడీపీ అభ్యర్థి మీద జరిగిన ఈ దాడి గురించి ఏపీలో జరుగుతున్న రాజకీయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.