షాకింగ్ న్యూస్: గుండు కొట్టించుకున్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

413

తెలంగాణ ఎన్నిక‌ల్లో మహాకూటమి బోల్తా కొట్టింది. అనుకున్నదంతా రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలందరికీ అపజయమే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి అంతో ఇంతో కలిసివచ్చిన వ్యక్తిగా మల్లు భట్టివిక్రమార్క మార్కులు కొట్టేశారు. ఆయన ఖమ్మం జిల్లా మధిర సెగ్మెంట్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు ఆ జిల్లా నుంచి మరో 7 స్థానాలు పార్టీ ఖాతాలో జమచేశారు. దీంతో ఆ పార్టీలో నెంబర్ వన్ లీడర్ గా మారిపోయారు. అధికారం మాదే అంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ దిగ్గజాలు చివరకు కారు జోరుతో ఢీలా పడ్డారు. జానారెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి అగ్రనేతలకు ఓటమి తప్పలేదు. అంతేకాదు వారి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది.

Image result for uttam kumar reddy
నల్గొండ జిల్లాకు చెందిన పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిలో బయటపడ్డారు. ఆయన సతీమణి మాత్రం ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి నల్గొండ జిల్లాలో పార్టీ వెనుకబడింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సెగ్మెంట్ లో గెలిచినా.. పీసీసీ అధ్యక్షుడిగా ఓడిపోయారనే భావన కనిపిస్తోంది. అటు ఖమ్మం జిల్లాలో 9 స్థానాలకు గాను 8 స్థానాల్లో పట్టు నిలుపుకొంది కాంగ్రెస్ పార్టీ. దీంతో రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉన్న భట్టి విక్రమార్కకు ప్లస్ పాయింట్ గా మారనుంది. అయితే ఈ స‌మ‌యంలో పీసీసీ సార‌ధిగా ఉన్న ఉత్త‌మ్ పోస్టు ఉంటుందా ఉండ‌దా అనేది తెలియాలి ..అయితే ఇప్ప‌టి వ‌రకూ గ‌డ్డం జుట్టుతో క‌నిపించిన ఆయ‌న మొత్తం గ‌డ్డం తీయించి గుండు చేయించుకున్నారు అని ఓ ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న ఇలాగే క‌నిపించారు, సొంత పార్టీ నేత‌లే ఈ అవ‌తారం ఏమిటి అని ప్ర‌శ్నించేవారు.

ఇక ఇప్పుడు ఆయ‌న గుండు చేయించుకున్నారు అని సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో వైర‌ల్ అవుతోంది, మ‌రి ఓట‌మి త‌ర్వాత ఇలా చేయించుకోవ‌డం ఏమిటి అని కూడా అంద‌రూ ఆలోచించారు, ఇంత‌కీ ఇక్క‌డ జ‌రిగిన విష‌యం వాస్త‌వం ఒక‌టి ఉంది. ఆయ‌న ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యంలో గ‌డ్డెంతో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. కాని ఆయ‌న గుండుగీయించుకున్న ఫోటో తీసి దానిని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు
ఇది ఫేక్ అని ఎప్ప‌టి ఫోటోనో ఇప్పుడు వైర‌ల్ చేస్తున్నారు అని చెబుతున్నారు కాంగ్రెస్ నేత‌లు.. ఇక ఎందుకు ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి వ‌చ్చింది అనే అంశంలో పోస్టుమార్టం చేసుకుంటున్నారు పార్టీ నాయ‌కులు…. మ‌రి చూశారుగా ఈ ఫోటో మొత్తం వైర‌ల్ చేశారు అంతే, ఇది పాత ఫోటో అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.