Breaking News :టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు మృతి షాక్ లో కేసీఆర్

481

అశ్వారావుపేట పట్టణం, భద్రాచలంరోడ్డులోని రైస్‌ మిల్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు వనపర్తి చినసత్యనారాయణ మృతిచెందాడు. ఆయ‌న వ‌య‌సు 54 సంవ‌త్స‌రాలు… పాతమామిళ్ళవారిగూడెంకు చెందిన టీఆర్‌ఎస్‌ గ్రామకమిటీ అధ్యక్షుడు వనపర్తి చిన సత్యనారాయణ బుధవారం అశ్వారావుపేట వచ్చిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసేందుకు మోటారు సైకిల్‌పై వస్తున్నాడు. పట్టణ సమీపంలోని రైస్‌ మిల్లువద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు మోటారుసైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలపైభాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అటుగా వస్తున్నవారు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రాథమిక చికిత్సచేసి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. సత్యనారాయణకు భార్య పద్మావతి, ముగ్గురు కుమారులున్నారు. సత్యనారాయణ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ సంఘటన తెలిసిన వెంటనే టీఆర్‌ఎస్‌ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు, తాండ్ర యుగంధర్‌, రామినేని సత్యనారాయణ, మొడియం సూర్యచంద్రరావు, ఉప్పల ప్రసాద్‌, ఉప్పల సతీష్‌, దంతినపల్లి వెంకటేశ్వరరావు, బొల్లుకొండ చెన్నారావు, బొడ్డు సత్యనారాయణ, సున్నం రామలక్ష్మయ్య, పల్లేల రామలక్ష్మయ్య టీఆర్‌ఎస్‌ మండల, గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సంతాపం తెలియజేసారు.ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలో కీల‌కంగా ఉన్నారు అని ఇలా ఆయ‌న‌కు ప్ర‌మాదం జ‌రిగింది అని తెలియ‌గానే పెద్ద‌సంఖ్య‌లో కార్య‌క‌ర్తలు అక్క‌డ‌కు చేరుకున్నారు.. ఇక్కడ పేద‌ల‌కు ఎటువంటి స‌మ‌స్య‌లు వ‌చ్చినా పార్టీ త‌ర‌పున స‌మ‌స్య‌లు తీర్చేవారు అని ఆయ‌న మ‌ర‌ణంతో అక్క‌డ వారు శోక‌సంద్రంలో మునిగిపోయారు.