Breaking News: చంద్రబాబునాయుడి ఇంట్లో విషాదం.. శోకసంద్రంలో కుటుంబసభ్యులు

431

ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీకి వ‌రుస షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి… ఇక నంద‌మూరి కుటుంబంలో హ‌రికృష్ణ మ‌ర‌ణం తీర‌ని లోటు అనే చెప్పాలి.. అంద‌రితో స‌ర‌దాగా ఉండే కుటుంబ పెద్ద‌, లేక‌పోవ‌డంతో త‌ల్ల‌డిల్లిపోయారు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు.. ఇక నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ త‌ర్వాత ఆ కుటుంబానికి పెద్ద‌గా ఉన్న ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో తీవ్ర దిగ్ర్బాంత‌కి లోన‌య్యారు అంద‌రూ. ఇక ఇప్పుడు నారా వారి కుటుంబంలో ఓ విషాదం అల‌ముకుంది.

Image result for chandrababu

చంద్రబాబు మేనల్లుడు ఉదయ్‌కుమార్‌ మృతి చెందారు. ఆయ‌న వ‌య‌సు 43 సంవ‌త్స‌రాలు కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయ్‌కుమార్ కన్నుమూశారు అని కుటుంబ స‌భ్యులు తెలియ‌చేశారు. స‌డెన్ గా గుండెపోటు రావడంతో ఈ ఉదయమే కేర్ ఆస్పత్రిలో చేరిన ఉదయ్‌కుమార్ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు ఉదయ్‌కుమార్‌. విషయం తెలిసిన చంద్రబాబు మరికాసేపట్లో అమరావతి నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. ఇక్క‌డే ఉంటున్న వారి కుటుంబం వ్యాపారాలు చేస్తున్నారు అని తెలుస్తోంది ఉద‌య్ వ్యాపార‌వేత్త‌గా ఉన్నార‌ట‌. ఇక ఆయన మ‌ర‌ణంతో చంద్ర‌బాబు షాక్ అయ్యారు.

ఇక మంత్రి లోకేష్ కు కూడా ఉద‌య్ తో మంచి సాన్నిహిత్యం ఉంది.. ఆయ‌న లేరు అనే విష‌యం తెలిసి చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది, ఇక మేన‌ల్లుడుగా ఇంటిలో పెద్ద‌వాడు అని ఆయ‌న ఇలా అకాల మ‌ర‌ణం చెంద‌డం త‌మ కుటుంబాన్ని విషాదంలో నింపింది అని తెలియ‌చేశారు. ఇప్ప‌టికే నారావారిప‌ల్లె చిత్తూరు నుంచి పెద్ద ఎత్తున ఆ కుటుంబ స‌భ్యులు బంధువులు హైద‌రాబాద్ వ‌స్తున్నారు, ఇటు నంద‌మూరి నారా కుటుంబాలు హైదరాబాద్ లో ఆయ‌న నివాసానికి వెళుతున్నారు. మ‌రి ఆయ‌న అకాల మ‌ర‌ణం ప‌ట్ల మీరుకూడా శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించండి కామెంట్ల రూపంలో.