Breaking News:జగన్ కుటుంబంలో విషాదం శోకసంద్రంలో..కుప్పకూలిన జగన్ షర్మిలా

237

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, జగన్ బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతిచెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. గుండెపోటుతో బాత్‌రూమ్‌లో మృతిచెంది ఉండగా ఆయనను కుటుంబసభ్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. పులివెందులలోని తన స్వగృహంలోనే కన్నుమూశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. వివేకాకు భార్య సౌభాగ్య, కుమార్తె సునీత ఉన్నారు. 1950 ఆగస్టు 8న జన్మించిన వైఎస్ వివేకానందరెడ్డి 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Image result for ys vivekananda reddy

గత ఐదారు రోజులుగా వైసీపీ అభ్యర్థుల ఎంపికలో జగన్‌కు తోడుగా ఉన్న వివేకా, గురువారం రాత్రే పులివెందులకు వచ్చారు. వచ్చేసరికి అర్ధరాత్రి కావడం, బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున వాంతులు మొదలుకావవడంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లి అక్కడే కుప్పకూలారు. ఆ సమయంలో ఇంట్లో వివేకానందరెడ్డి ఒక్కరే ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నానాల గదిలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

Image result for ys vivekananda reddy

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్‌తో విభేదించిన ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వేరుకుంపటి పెట్టుకున్నా వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో కొనసాగారు. కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాలు కడప నుంచి ఎంపీగా విజయం సాధించారు. వైఎస్ ఆ సీటు నుంచి తప్పుకున్నాక వివేకానందరెడ్డికి అవకాశం వచ్చింది. ఒక దశలో కాంగ్రెస్ హైకమాండ్ వివేకానందరెడ్డిని జగన్ కు వ్యతిరేకంగా ఉసిగొల్పింది. అయితే తర్వాత మారిన పరిణామాలతో వైసీపీలోకి చేరి జగన్‌కు అండగా ఉన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

వైఎస్ వివేకా హఠాన్మరణంతో వైసీపీ నేతలు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ సీటుకు వైఎస్ వివేకా పేరు పరిశీలనలో ఉండగా అంతలోనే ఆయన కన్నుమూశారు. 1999,2004 లలో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. జగన్ కోసం 2009 ఎన్నికల్లో కడప ఎంపీ సీటును వదులుకున్నారు. చాలా సౌమ్యుడి పేరుపొందిన వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ అభిమానుల్లో విషాదఛాయలు నింపింది.

Image result for ys vivekananda reddy

ఇక‌, జ‌గ‌న్ పార్టీ ఏర్పాటు చేసిన స‌మ‌యంలో ఆయ‌న జ‌గ‌న్ తో క‌ల‌వలేదు. ఆ స‌మ‌యంలో విజ‌య‌మ్మ పైనే పోటీ చేసారు. కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో వ్య‌వ‌సాయ శాఖా మంత్రిగా ప‌ని చేసారు. ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. పులి వెందుల లో ప‌రాజ‌యం త‌రువాత ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసారు. వైయ‌స్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యం లో క‌డ‌ప రాజ‌కీయాల‌ను పూర్తిగా వివేకా ప‌ర్య‌వేక్షించేవారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి జ‌గ‌న్కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత క‌డ‌ప లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేసి ఓడిపోయారు. నాలుగు రోజులుగా లోట‌స్ పాండ్ లో ఉంటూ..అక్క‌డికి వ‌చ్చిన అసంతృప్తుల‌ను బుజ్జ‌గించారు. పులివెందుల లో జ‌గ‌న్ త‌ర‌పున ఆయ‌న గురువారం ప్ర‌చారం ప్రారంభించారు. ఇప్పుడు స‌డ‌న్ గా ఈ షాకింగ్ న్యూస్ మొత్తం వైసిపి లో షాకింగ్ న్యూస్ గా మారింది. జ‌గ‌న్ కుటుంబం హుటాహుటిన పులివెందుల‌కు ప‌య‌న‌మైంది.