Breaking News:తెలంగాణ‌లో ఎమ్మెల్యే కుమారుడు మృతి శోక‌సంద్రంలో కుటుంబం

343

తెలంగాణ ఎన్నిక‌లు ముగిసాయి ఈ స‌మ‌యంలో తెలంగాణ‌లో గెలిచిన ఎమ్మెల్యేలు అంద‌రూ ఆనందంలో ఉన్నారు.. ఇక ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో నాంప‌ల్లి నుంచి ఎంఐఎం నుంచి పోటీ చేసిన జాఫ‌ర్ మాత్రం చాలా దిగాలుగా ప్ర‌చారం చేశారు.. ఆ స‌మ‌యంలో త‌న కుమారుడు అనారోగ్యంతో ఉండ‌టంతో ఆయ‌న ప్ర‌చారానికి పెద్ద ఆస‌క్తి చూపించ‌లేదు.. దీంతో ఓవైసీ కుటుంబం మైనార్టీ నాయ‌కులు అక్క‌డ ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఆయ‌న గెలుపొందారు, కాని నేడు ఆయ‌న ఇంట విషాదం అల‌ముకుంది.. ఆస్ప‌త్రిలో చికిత్స్ పొందుతున్న ఆయ‌న కుమారుడు మ‌ర‌ణించారు.

Image result for trs

నాంపల్లి ఎమ్మెల్యే, ఎంఐఎం నాయకుడు జాఫర్ హుస్సేన్ మెరాజ్ కుమారుడు మక్సూద్ హుస్సేన్ వ‌య‌సు 34 సంవవ్స‌రాలు, ఆయ‌న అనారోగ్యంతో మృతిచెందారు అని ప్ర‌క‌టించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మక్సూద్ మృతిచెందారు అని ఆయ‌న కుటుంబం తెలియ‌చేసింది.ఎంబీఏ పూర్తి చేసిన మక్సూద్ హుస్సేన్‌కు మూడేళ్ల కిందటే పెళ్లి అయ్యింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న మక్సూద్ హుస్సేన్‌కు నవంబర్ 23న కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తో ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. అప్పటి నుంచి రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు చెప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ ఉదయం మక్సూద్ చనిపోయినట్టు తెలిపారు. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఇక్క‌డ ఆయ‌న గురించి వారి కుటుంబం గురించి అంద‌రూ క‌న్నీరు పెట్టుకున్నారు.. గెలిచిన త‌ర్వాత ఈ విష‌యంలో కుమారుడు కూడా ఆరోగ్యంగా ఇంటికి రావాలి అని ఆయ‌న ప్రార్ధ‌న‌లు చేశారు.. కాని ఇలా దారుణం జ‌రుగ‌డంతో ఆ కుటుంబం క‌న్నీటి ప‌ర్యంతం అయింది.. ఈ విష‌యం తెలియ‌డంతో టీఆర్ఎస్ ఎంఐఎం నాయ‌కులు ఆయ‌న ఇంటికి పెద్ద సంఖ్య‌లో చేరుకుని సంతాపం తెలియ‌చేస్తున్నారు… మ‌రి ఆయ‌న కుమారుడి ఆత్మ‌కు శాంతి చేకూరాలని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.