జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బాబుకు భారీ షాక్

247

ఈసారి ఎన్నిక‌ల్లో వైసీపీ 151 స్ధానాలు గెలుచుకోవ‌డం, తెలుగుదేశం పార్టీ కేవ‌లం 23 స్ధానాల‌కు ప‌రిమితం అవ్వ‌డంతో ఆ పార్టీనేత‌లు ఎప్పుడు ఎవ‌రు పార్టీ మార‌తారా అనే డైల‌మా తెలుగుదేశం పార్టీకి ప‌ట్టుకుంది ..ముఖ్యంగా టీడీపీలో కొంద‌రు కీల‌క నేతలు ఇప్ప‌టికే బీజేపీ వైసీపీ వైపు చూస్తున్నారు.. న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిపోయారు. తాజాగా మ‌రికొంద‌రు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు.

Image result for వీరశివారెడ్డి పార్టీకి

ఈ స‌మ‌యంలో క‌డప జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టీడీపీకి రాజీనామా లేఖను పంపానని.. అనుచరులతో చర్చించి జిల్లా అభివృద్ధి కోసం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు కేడర్ మొత్తం పార్టీలో చేరుతున్నామని చెప్పారు.

Image result for వీరశివారెడ్డి పార్టీకి

సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు తనకు టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశారని వీరశివారెడ్డి మండిపడ్డారు. బాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అందుకే పూర్తిగా తిరస్కరించారన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను గమనించకుండా.. ఓడిపోయే వారికే చంద్రబాబు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. సీఎం జగన్‌ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

ఈ క్రింద వీడియోని చూడండి

కాంగ్రెస్ హయాంలో కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వీరశివారెడ్డి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పుత్తా నరసింహారెడ్డికే టికెట్ ఇచ్చారు. దీంతో శివారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.. ప్రచారానికి కూడా వెళ్లలేదు. దీంతో చంద్రబాబు పిలిచి మాట్లాడారు.. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Image result for వీరశివారెడ్డి పార్టీకి

తర్వాత వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల తర్వాత వీరశివారెడ్డిని ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటూ జిల్లా ముఖ్య నేతలు కలిశారు. అప్పుడే ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది.. దీనిపై ఆయన స్పందించ లేదు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత వైసీపీలో చేరికపై క్లారిటీ వచ్చింది. వీరశివారెడ్డి జగన్ విదేశీ పర్యట నుంచి రాగానే వైసీపీలో చేరతారని అనుచరులు చెబుతున్నారు… వీర‌శివారెడ్డి పార్టీలో చేరితే ఇక కమ‌లాపురంలో టీడీపీ ఖాళీ అవుతుందంటున్నారు అక్క‌డ స్దానిక కేడ‌ర్.. ఇంకా క‌డ‌ప జిల్లాలో మ‌రికొంద‌రు టీడీపీ నేత‌లు పార్టీ మారి వైసీపీ లో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని చెబుతున్నారు నేత‌లు.