BREAKING NEWS- టీడీపీ సీనియ‌ర్ నేత క‌న్నుమూత.

359

తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది , ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌లువురు సీనియ‌ర్ల‌ని కోల్పోయిన తెలుగుదేశం తాజాగా మ‌రో సీనియ‌ర్ నాయ‌కులు తెలుగుదేశం పార్టీ వీరాభిమానిని కోల్పోయింది. జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ కడియాల రాఘవరావు మృతితో గన్నవరంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో తెల్లవారుజామున మృతి చెందిన ఆయన భౌతికకాయానికి పలువురు టీడీపీ నేతలు, రాజకీయవేత్తలు నివాళులర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Image result for కడియాల రాఘవరావు
జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ కడియాల రాఘవరావు వ‌య‌సు 76 సంవ‌త్స‌రాలు.. ఆయ‌న‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ రాఘవరావు కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, నాయకులు, ప్రజలు దిగ్ర్భాంతికి గురయ్యారు. గన్నవరంలోని ఎస్‌బీఐ పక్కన ఉన్న స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు దాసరి బాలవర్థనరావు, మూల్పూరి బాలకృష్ణారావు, ముసునూరు రత్నబోస్‌, ఏఎంసీ చైర్మన్‌ పొట్లూరి బసవరావు, అపెక్స్‌ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య, విజయ డెయిరీ డైరెక్టర్‌ చలసాని ఆంజనేయులు, రూరల్‌ ఎంపీపీ వడ్లమూడి జగన్మోహనరావు, సీపీఎం నేతలు వై.నరసింహారావు, కళ్లం వెంకటే శ్వరరావు, అనుమోలు వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, పలువురు రాజకీయ ప్రముఖులు రాఘవరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మండలంలోని మాదలవారి గూడెంలో 1943లో కడియాల రాఘవరావు జన్మించారు. మొదటి నుంచి సీపీఎంలో ఉండేవారు. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించిన తర్వాత పార్టీ మారారు. 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1987లో ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీ అయ్యారు. 1995లో జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. దీంతో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి వరించింది. జడ్పీచైర్మన్‌గా ఉంటూనే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీపై అంకితభావం ఉన్న రాఘవరాకు సీఎం చంద్రబాబు తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడితో పాటు పలు పదవులు అప్పగించారు. పదవులన్నంటికీ ఆయన వన్నె తెచ్చారు. మ‌రి ఆయ‌న‌కు మీరు కూడా నివాళులు అర్పించండి.