Breaking News: సుష్మాస్వరాజ్ ఇక లేరు

100

బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) ఇకలేరు. యావత్ భారతావనిని శోకసంద్రంలో ముంచుతూ గుండెపోటుతో ఆమె హఠాన్మరణం చెందారు. మంగళవారం (ఆగస్టు 6) రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఆమె గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. గుండెపోటుకు గురైన కొద్ది క్షణాలకే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన సుష్మా స్వరాజ్ 25 ఏళ్ల వయసులోనే హర్యాణా కేబినెట్‌లో మంత్రి పదవిని చేపట్టారు. పిన్న వయసులోనే మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

సుష్మా స్వరాజ్‌ సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ పనిచేశారు. ఆమె భర్త కౌశల్‌ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. మోదీ ప్రభుత్వంలో సుష్మాస్వరాజ్‌ 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో మంత్రిగా పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తెలంగాణ చిన్నమ్మగా గుర్తింపు పొందిన సుష్మా స్వరాజ్‌ ప్రాంతాలకతీతంగా, ఆ మాటకొస్తే దేశాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన చాలా మంది పౌరుల సమస్యలను పరిష్కరించి దాయాది దేశంలోనూ అభిమానులను సంపాదించుకున్నారు.

Image result for సుష్మాస్వరాజ్

2009 నుంచి 2014 వరకు 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా బాధ్యతలు నిర్వహించారు. ఢిల్లీ ఐదో ముఖ్యమంత్రిగానూ సుష్మా పనిచేశారు. షీలా దీక్షిత్‌‌కు గట్టి పోటీ ఇచ్చారు. 1998 అక్టోబర్‌ 13 నుంచి డిసెంబరు 3 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1953 ఫిబ్రవరి 14న హర్యాణాలోని అంబాలలో జన్మించిన సుష్మా స్వరాజ్ 1970లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏబీవీపీలో యాక్టివ్ మెంబర్‌గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన సుష్మా స్వరాజ్ అతి తక్కువ కాలంలోనే ఉన్నత పదవులను అధిరోహించారు. సుష్మా స్వరాజ్ మరణవార్తతో బీజేపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. హోంమంత్రి అమిత్ షా, మంత్రలు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. సుష్మా మృతికి ప్రధాని మోడీ సంతాపాన్ని తెలియజేశాడు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసింది. ప్రజాసేవ, పేదల అభ్యున్నతి కోసమే సుష్మాజీ తన జీవితాన్ని అంకితం చేశారు. దేశం కోసం సుష్మా చేసిన ప్రతి పనిని ప్రజలు గుర్తించుకుంటారు. సుష్మా స్వరాజ్‌ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. సుష్మాజీ అస్తమయం చెందడం వ్యక్తిగతంగా నాకు ఎంతో లోటు. దేశానికి ఆమె చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. సుష్మాను అభిమానించే వారికి ఇది ఎంతో దురదృష్టకరమైన పరిస్థితి. నా ఆలోచనలన్నీ సుష్మా కుటుంబసభ్యులతోనే ఉంటాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. మనం కూడా కామెంట్ రూపంలో ఆమె మృతికి నివాళి అర్పిద్దాం.