Breaking NEWS :రిపబ్లిక్ డే రోజు విషాదం..ప్రముఖ టీఆర్ఎస్ సీనియర్ నేత మృతి..శోక సంద్రంలో కెసిఆర్

226

అశ్వారావుపేట పట్టణం, భద్రాచలంరోడ్డులోని రైస్‌ మిల్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు వనపర్తి చినసత్యనారాయణ మృతిచెందిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే తెలంగాణ‌లో మ‌రో నాయ‌కుడు మృతి నాయ‌కుల‌ని క‌లిచివేసింది. మ‌హ‌బూబాబాద్ కురవి మండలం గుండ్రాతిమడుగుకు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత బండి సురేందర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన వ‌య‌సు 73 సంవ‌త్స‌రాలు.. గత కొతకాలంగా ఆయన క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ హైద్రాబాద్‌లోని ఆయన కుమారుడు మాధవ్‌ నివాసంలో చికిత్స చేయించుకుంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే… పరిస్థితి విషమించిన ఆయన చికిత్స పొందుతూనే మృతిచెందారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న సురేందర్‌రెడ్డి గతంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. గుండ్రాతిమడుగు పీఏసీఎస్‌ చైర్మన్‌గా పనిచేశారు. సురేందర్‌రెడ్డి భార్య బం డి భారతమ్మ గతంలో కురవి జడ్పీటీసీగా పనిచేశారు. కాగా… సురేందర్ రెడ్డి మృతితో గుండ్రాతిమడుగులో విషాదం అలుముకుంది. సురేందర్‌రెడ్డి మృతివార్త తెలుసుకున్న డీఎస్‌ రెడ్యానాయక్‌ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. సురేందర్‌రెడ్డి మృతి తీరని లోటన్నారు. అనంతరం మహబుబాబాద్‌ నుంచి మృతదేహాన్ని పెద్దతండా మీదుగా ఊరేగింపుగా తీసుకువచ్చి గుండ్రాతిమడుగులో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో బజ్జూరి పిచ్చిరెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, అల్లూరి పట్టాభిరామరాజు తదితరులు పాల్గొన్నారు.