BREAKING NEWS -ప‌వ‌న్ క‌ల్యాణ్ అరెస్ట్

335

ఏపీలో ఎన్నిక‌ల హీట్ బాగా క‌నిపిస్తోంది, ఓ ప‌క్క వైసీపీ తెలుగుదేశం ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి అలాగే విమ‌ర్శ‌లు కూడా ఒక‌రిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు ఈ స‌మ‌యంలో వైసీపీ తెలుగుదేశం పార్టీల‌కు ధీటుగా మరోపార్టీ జ‌న‌సేన రెడీ అయింది. ఆయ‌న కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు, ప‌వ‌న్ ఇప్ప‌టికే భీమ‌వ‌రం గాజువాక‌లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ స‌మ‌యంలో ఎన్నిక‌ల స‌భ‌ల్లో అనేక విమ‌ర్శ‌లు చేస్తున్నారు ముఖ్యంగా ఎన్నిక‌ల వేళ పార్టీల అధినేతలు ఏపీ కాకుండా తెలంగాణ రాజ‌కీయాల పై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు కేసీఆర్ జ‌గ‌న్ వెంట ఉన్నారు అని జ‌గ‌న్ ని న‌మ్మి ఓట్లు వేయ‌ద్దు అని చంద్ర‌బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు ఇక ప‌వన్ కూడా తెలంగాణ‌పై చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద దుమారం లేపాయి.

ఈ క్రింది వీడియో చూడండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల భీమవరం సభలో పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తెలంగాణానా.. పాకిస్థానా? అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పవన్ రాజకీయ లబ్ధి పొందడం కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్, ఇక్కడి ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర ప్రజలను పవన్ తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు.

Image result for pawan kalyan

దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని జేఏసీ నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగిన సమయంలోనూ ఇక్కడున్న ఆంధ్రులపై తెలంగాణ ప్రజలు దాడులు చేయలేదనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడి సూచనలతో పవన్‌ కళ్యాణ్ ఓట్ల కోసం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఎవరి భూములను లాక్కున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి, తెలంగాణలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్న పవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Image result for pawan kalyan

జేఏసీ అడ్వొకేట్లతోపాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జూబ్లీహిల్స్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లలో పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. అంతేకాదు ప‌వ‌న్ ఈ విష‌యం పై క్లారిటీ ఇవ్వ‌క‌పోతే త‌న వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకోక‌పోతే తాము ప‌వ‌న్ అరెస్ట్ అయ్యేవ‌ర‌కూ నిర‌స‌న చేస్తాము అని డిమాండ్ చేస్తున్నారు, మ‌రి ప‌వ‌న్ దీనిపై ఎలాంటి స‌మాధానం చెబుతారో చూడాలి.