BREAKING NEWS ఏపీకి కొత్త గ‌వ‌ర్న‌ర్

127

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పాగా వేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా చకచకా పావులు కదుపుతున్న బీజేపీ, తాజాగా అక్కడ పాలనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమించింది. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ ఒక్కరే గవర్నర్ గా ఉన్నారు. రెండు రాష్ట్రాల పాలన విషయంలో రెండు చోట్లకు తిరుగుతున్నారు. కొన్ని రోజుల క్రితమే కొత్త గవర్నర్ ను నియమిస్తారని వార్తలు వచ్చినా అందులో నిజం లేదు. కాగా, ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్ప‌టికే కిర‌ణ్ బేడి, సుమిత్రా మ‌హాజ‌న్ సుష్మాస్వ‌రాజ్ పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి కాని వారు ముగ్గురు కూడా ఏపీకి గ‌వ‌ర్న‌ర్ గా రావ‌డం లేదు అని తెలియ‌చేశారు. తాజాగా కొత్త గ‌వ‌ర్న‌ర్ ని నియ‌మించారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

రాష్ట్రపతి భవన్ నుంచి ఈ వార్త అధికారికంగా వచ్చింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు అనసూయ ఊకేను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. బిశ్వభూషణ్‌ జనసంఘ్‌, జనతా పార్టీలో పనిచేశారు. ఏపీ కొత్త గవర్నర్ కు ఉండేందుకు రాజ్ భవన్ ను ఏపి ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడలో మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ పరిపాలన భవనంగా ఉపయోగించిన భవనాన్ని గవర్నర్ కోసం కేటాయించారని తెలుస్తోంది.

Image result for బిశ్వ భూషణ్

రాజకీయవర్గాల్లో ప్రసాద్‌ హరిచందన్‌గా పాపులర్‌ అయ్యారు. బిశ్వ భూషణ్ సుదీర్ఘకాలంగా సంఘ్‌పరివార్‌తో అనుబంధం కలిగివున్నారు. 1988 నుంచి బీజేపీలో క్రియాశీలంగా ఉంటూ రచయితగా అనేక పుస్తకాలు రాశారు. అవినీతిపై పోరు, మొక్కల పెంపకంపై ఆయనకు ఎనలేని ఆసక్తి ఉంది. ఆయన త్వరలోనే ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీకి కొత్త గవర్నర్ ఎంపిక ఖరారు కావడంతో… ఇంతకాలం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్ తెలంగాణకే పరిమితమవుతారా అనే చర్చ మొదలైంది.ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించిన కేంద్రం… తెలంగాణకు మాత్రం మరొకరిని గవర్నర్‌గా నియమించలేదు. దీంతో ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు గవర్నర్’గా వ్యవహరిస్తున్న నరసింహన్ ఇక తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Image result for బిశ్వ భూషణ్

దాదాపు తొమ్మిదేళ్లకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్‌కు స్థానచలనం ఉంటుందని చాలాసార్లు ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ పెద్దల దృష్టిలో మంచి మార్కులు వేయించుకున్న నరసింహన్… ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరించే విషయంలో తనవంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. దీంతో నరసింహన్ స్థానంలో మరొకరిని నియమించడం ద్వారా మళ్లీ కొత్త సమస్యలు వస్తాయని భావించిన కేంద్రం… ఆయననే గవర్నర్‌గా కొనసాగిస్తూ వచ్చింది.

Image result for బిశ్వ భూషణ్

తాజాగా ఏపీకి ప్రత్యేకంగా కొత్త గవర్నర్‌ను నియమించడంతో… తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తెలంగాణ గవర్నర్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికప్పుడు నరసింహన్‌ పదవికి ఢోకా లేకపోయినప్పటికీ… సమీప భవిష్యత్తులో ఆయనకు స్థానచలనం ఉండే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.