Breaking News..లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ ఇకలేరు

459

వరుసగా ప్రముఖులు చనిపోతున్నారు.దాంతో వారి అభిమానులు తీవ్ర ఆవేదనలో ఉంటున్నారు.అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖుల ఇళ్ళలో విషాద చాయలు అలుముకుంటున్నాయి.ఇప్పుడు మరొక ప్రముఖ రాజకీయ నాయకుడు చనిపోయాడు.మరి ఆయన ఎవరో ఎలా చనిపోయాడో తెలుసుకుందామా.

Image result for సోమ్‌నాథ్ చటర్జీ

గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోన్నసోమ నాథ్ ఛటర్జీ చటర్జీ సోమవారం నాడు కన్నుమూశారు.శనివారం మరోసారి అస్వస్థతకు గురికావడంతో కోల్‌కతాలోని ఓ హాస్పిటల్‌లో చేరారు. అయితే ఆదివారం ఉదయం ఆయనకు స్వల్పంగా గుండెపోటు రావడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. డయాలసిస్‌ చేయించుకున్నారని, అలాంటి వారికి ఒక్కోసారి గుండె స్పందించదని వైద్యులు తెలిపారు. ఆదివారం ఉదయం స్వల్పంగా గుండెపోటు వచ్చినా కోలుకున్నారు గానీ కృత్రిమశ్వాసపై ఉన్నారని ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి. అయితే సోమవారం తెల్లవారుజామున ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

Image result for సోమ్‌నాథ్ చటర్జీ

మూత్రపిండాల సమస్యతో బాధపడుతోన్న సోమనాథ్‌ను వైద్యం కోసం ఆగస్టు 10 న కోల్‌కతాలోని బెల్లే వ్యూ ఆస్పత్రిలో చేర్పించారు. ఛటర్జీకి గత జూన్‌లో మెదడు నరాలు చిట్లిపోవడంతో పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. అలాగే జులైలో శ్వాససంబంధ సమస్యతోనూ హాస్పిటల్‌లో చేరిన ఆయన కొద్ది రోజుల కిందటే డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో శుక్రవారం మళ్లీ అడ్మిట్ అయ్యారు.ఈయన 25 జులై 1929 లో కోల్ కత్తా లోని తేజ్ పూర్ లో జన్మించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

లోక్‌సభకు అత్యధిక సార్లు ఎన్నికైన పార్లమెంటు సభ్యుల్లో సోమ్‌నాథ్ కూడా ఒకరు. పదిసార్లు ఎంపీగా 1971 నుంచి 2009 వరకూ మధ్యలో 1984లో ఒక్కసారి తప్ప అన్ని ఎన్నికల్లోనూ గెలుపొందారు. మధ్యలో 1984 ఎన్నికల్లో ప్రస్తుత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేతిలో ఓటమి చవిచూశారు. జులై 1968లో సీపీఎంలో చేరిన ఛటర్జీ 2008 వరకు 40 ఏళ్లు ఆ పార్టీలో కొనసాగారు. యూపీఏ-1 ప్రభుత్వంలో లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే, యూపీఏ ప్రభుత్వం చేసుకున్న భారత్- అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అనూహ్యంగా 2008లో సీపీఎం మద్దతు ఉపసంహరించింది. కానీ, సోమ్‌నాథ్ లోక్‌సభ స్పీకర్‌ పదవి నుంచి తప్పుకోడానికి సనేమిరా అనడంతో ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరించారు.ఆయన మృతికి ప్రధాన మంత్రి,సోనియా గాంధీ,రాహుల్ గాందీ,మమతా బెనర్జీ నివాళులు అర్పించారు.మనం కూడా కామెంట్ రూపంలో ఆయన మృతికి నివాళులు అర్పిద్దాం.