BREAKING NEWS -సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు

334

తెలంగాణ‌లో గ‌త ఏడాది ఎన్నిక‌లు పూర్తి అయ్యాయి.. అయితే ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మిగిలిన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కాని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల‌ను చిత్తుగా ఓడించి రెండోసారి సీఎంగా కేసీఆర్ అయ్యారు.. ఇక కేసీఆర్ సీఎం అయిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ త‌న దూకుడు త‌గ్గించింది ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు అయితే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో మ‌రోసారి కాంగ్రెస్ పార్టీ డీలాప‌డింది ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు కారు పార్టీలో చేరుతున్నారు, సబితా ఇంద్రారెడ్డి లాంటి సీనియ‌ర్ నేత కూడా కారుఎక్కారు.. సో రాజ‌కీయంగా గ‌డ్డుప‌రిస్దితులు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది, ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం రాజ‌కీయ పార్టీలు స‌మాయ‌త్తం అవుతున్నాయి.

Image result for kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. కేసీఆర్‌కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఈ కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఈ క్రింది వీడియో చూడండి

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని.. గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్‌పై 64 క్రిమినల్ కేసులు ఉంటే.. మొదటి అఫిడవిట్‌లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటిషన్‌లో ప్రస్తావించారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసీఆర్‌ను ఎమ్మెల్యే‌గా అనర్హుడు‌గా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. అయితే దీనిపై రిట‌ర్నింగ్ అధికారులు వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు.. కావాల‌నే కొంద‌రు కుట్ర‌ల‌తో కేసీఆర్ ప్ర‌తిష్ట దిగ‌జార్చేందుకు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు అని విమ‌ర్శించారు టీఆర్ఎస్ నాయ‌కులు