Breaking News : కేంద్ర మాజీ మంత్రి మృతి షాక్ లో మోదీ

199

కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ కన్నుమూశారు.. ఆయ‌న వ‌య‌సు 88 సంవ‌త్స‌రాలు…దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో రక్షణ, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా ఫెర్నాండెజ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1930, జూన్‌ 3న కర్ణాటకలోని మంగళూరులో ఆయన జన్మించారు. కార్మిక సంఘాల్లో కీలకంగా పనిచేశారు. జనతాదళ్‌లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన.. 1994లో సమతా పార్టీని ఆయన స్థాపించారు. 2009 ఆగస్టు నుంచి 2010 జులై వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఫెర్నాండెజ్‌ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈయన మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్లారు. ఫెర్నాండెజ్ మృతిపట్ల వివిధ పార్టీల నేతలు విచారాన్ని వ్యక్తం చేశారు.. 1930 జూన్ మూడో తేదీన జన్మించిన ఫెర్నాండెజ్… ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగారు. ముఖ్యంగా, అనేక కార్మిక శాఖల్లో అత్యంత కీలకమైన భూమికను పోషించారు. అలాగే, మాజీ ప్రధాని భారతరత్న వాజ్‌పేయి మంత్రివర్గంలో ఆయన రక్షణ శాఖామంత్రిగా ఉన్నారు. అదేవిధంగా రైల్వే, పరిశ్రమలు, కార్మిక శాఖామంత్రిగా కూడా పని చేశారు. ముఖ్యంగా జనతాదళ్‌లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన.. 1994లో సమతా పార్టీని స్థాపించారు.దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ హయాంలో రక్షణ, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రిగా ఫెర్నాండెజ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. 1967 నుంచి 2004 వరకు 9 సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మృతిప‌ట్ల అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఆయ‌న‌కు నివాళి అర్పించారు.