Breaking News :పులివెందుల‌లో విషాదం మాజీ ఎమ్మెల్యే మృతి

301

సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నాయకుడు, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 97 సంవ‌త్స‌రాలు..గురువారం శివరామిరెడ్డి బ్రెయిన్‌ డెడ్‌కు గురికావడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు ఆస్పత్రి వైద్యులు మీడియాకు తెలిపారు. గతవారం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శివరామిరెడ్డికి గుండె సంబంధిత ఆపరేషన్‌ జరిగింది. ఆయ‌న మ‌ర‌ణంతో జిల్లా నేతులు నివాళులు అర్పించారు.వైఎస్సార్‌ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు. ఇలా ఆయ‌న మ‌ర‌ణంతో జిల్లా నేత‌లే కాదు రాష్ట్రంలో క‌మ్యూనిస్టు సోద‌రులు క‌న్నీరు మున్నీరు అయ్యారు, ఆయ‌న ఆత్మ‌కు శాంతిచేకూరాలి అని అన్ని పార్టీల నేత‌లు సంతాపం ప్ర‌క‌టించారు. ఇక పులివెందుల క‌మ‌లాపురంలో ఆయ‌న వ‌ర్గం ఆయ‌న భౌతిక‌ఖాయం చూసేందుకు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు.మీరు కూడా ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి అని కామెంట్ల రూపంలో నివాళి అర్పించండి.