Breaking News -టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

82

తెలుగుదేశం పార్టీకి ఇటీవ‌ల షాక్ ల మీద షాక్ లు త‌గుతున్నాయి..ఇటీవ‌ల పార్టీ నేతలు మ‌ర‌ణించ‌డం తెలుగుదేశం పార్టీకి షాక్ అనే చెప్పాలి.ఇప్ప‌టికే గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు అలాగే హ‌రికృష్ణ‌మృతి చెందిన త‌ర్వాత పార్టీ కేడ‌ర్ మ‌రింత కృంగిపోయింది… తాజాగా మ‌రో సీనియ‌ర్ నేత‌టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆమెను విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం చికిత్స పొందుతూ అన్నపూర్ణమ్మ మృతి చెందారు… అన్నపూర్ణమ్మ మృతిపై టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ త‌ర‌పున ఉన్నారు..ఆమె మ‌ర‌ణంతో జిల్లా నాయ‌కులు షాక్ లో ఉన్నారు.. తెలుగుదేశం పార్టీ నేత‌లు ఆమె భౌతిక కాయం సంద‌ర్శించి నివాళి అర్పించారు..ఈ విష‌యం తెలిసిన వెంట‌నే సీఎం చంద్ర‌బాబు కూడా ఆమె మృతిప‌ట్ల సంతాపం తెలియ‌చేశారు.. మ‌హిళా నాయ‌కురాలిగా ఆమె ఎంతో పేరు సంపాదించారు అని ఆమె మ‌ర‌ణం పార్టీకి తీర‌ని లోటు అని జిల్లా నేత‌లు ఆమెకు శ‌ద్దాంజ‌లి ఘ‌టించారు.