Breaking News: నిరుద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన చంద్రబాబు

176

ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో పెద్ద ఎత్తున వ‌రాలు ప్ర‌క‌టిస్తున్నారు చంద్రబాబు, ముఖ్యంగా ఏపీలో అంతా ఆయ‌న సుడిగాలి ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా ఆయ‌న ఇస్తున్న హామీల‌తో ఏపీలో నిరుద్యోగులకు పండగే. చంద్రబాబు సర్కారు ఇస్తున్న వరాలతో యువత ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఇంకా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించకుండానే టీడీపీ అధినేత భారీ వరాలు కురిపిస్తున్నారు. ఇక మేనిఫెస్టోలో ఇంకెన్ని వరాలు వేచి ఉన్నాయో అని చూస్తున్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే.. ‘యువనేస్తం’ పథకం ఇచ్చే నిరుద్యోగ భృతిని 18ఏళ్లకే ఇచ్చేందుకు.. అది కూడా రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు తన మేనిఫెస్టోలో హామీని పొందుపరుస్తోంది. ఇంటర్మీడియెట్‌తోనే చదువు ఆపేస్తున్న వారికి కూడా యువనేస్తం ద్వారా ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Image result for నిరుద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన చంద్రబాబు

నిరుద్యోగభృతి కోసం దరఖాస్తు చేయాలంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీసం 23 ఏళ్ల వయసుండాలి. ఆ పరిమితిని తగ్గించడంతోపాటు పలు ఆకర్షణీయ హామీలను మేనిఫెస్టోలో ప్రకటించనుంది.యువతకు ఉద్యోగాల కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలోనే రాష్ట్రంలో కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఏటా నియామకాల నోటిఫికేషన్లు ఇస్తామని, నియామకాల కేలండర్‌ను విడుదల చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది. ఇందుకోసం ఏటా మార్చి 31నాటికి ప్రతి ప్రభుత్వ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే జాబితా సిద్ధం చేస్తారు. ఏప్రిల్‌ తొలివారంలో ఏపీపీఎస్సీకి పంపిస్తారు. ఏపీపీఎస్సీ వాటి భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. నిరుద్యోగ యువతకు పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇచ్చి పరీక్షలు పెడతారు. ఏటా నోటిఫికేషన్లు ఇస్తారు కాబట్టి ముందు నుంచే ప్రణాళిక ప్రకారం సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. నిరుద్యోగ భృతిని రూ.3 వేలకు పెంచితే.. ఉద్యోగం వచ్చేవరకూ సొంత ఖర్చులకు తల్లిదండ్రులపై ఆధారపడే అవసరం యువతకు ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు.ఒకవైపు నిరుద్యోగ భృతి ఇస్తూనే.. వారు ఉద్యోగం, ఉపాధి సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తే ఇటు యువతకు అవకాశాలు రావడంతో పాటు ఉద్యోగ యంత్రాంగంలో కొత్త రక్తం వస్తుందని భావిస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇది ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబునాయుడు ఈ మేరకు హామీలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఓసీలతో సహా విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.14 వేల దాకా ఇస్తున్న పాకెట్‌ మనీని భారీగా పెంచాలని సీఎం నిర్ణయించారు.

Image result for jobs searching people

అలాగె విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దే క్రమంలో.. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన డిజిటల్‌ క్లాస్‌రూంలను అన్ని పాఠశాలలకూ విస్తరించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. రాష్ట్రంలో దాదాపు 50వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్‌లు కలిసి ఇన్ని ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను రాబోయే ఐదేళ్లలో డిజిటల్‌ తరగతులే ఉంటాయి. దీంతో ఇంటర్‌ స్థాయికి వచ్చేసరికే పిల్లలు భవిష్యత్‌ తరానికి తగినట్లుగా తయారవుతారని చెప్తున్నారు. ఇక విద్యార్దుల‌కు చ‌దువుకునే స‌మ‌యంలో ఉచితంగా కొన్ని నోట్ బుక్స్ అందించే ప్ర‌ణాళిక కూడా చేస్తున్నారు, అలాగే ఉద్యోగాల కోసం వేచి చూసే వారికి జిల్లాలో స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ క్లాసులు మ‌రింత పెంచాలి అని సుమారు 20 క్లాసులు ఏర్పాటుచేసే విధంగా ప్ర‌ణాళిక చేస్తున్నారు, తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణ‌యంతో నిరుద్యోగులు ఆనందంలో ఉన్నారు. మ‌రి ఈ నిర్ణ‌యం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ల‌రూపంలో తెలియ‌చేయండి.