బ్రేకింగ్ : ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న కత్తి మహేష్ సర్వే రిపోర్ట్స్.!

239

ఇంక ఎలాగో ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్నాయి ఏ పార్టీ జాతకం ఎలా ఉండబోతుందో అన్న విషయం తెలుసుకునేందుకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ప్రతీ ఒక్కరిలో ఆసక్తి మరింత రేకెత్తుతోంది.ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాలపై అనేక రకాల సర్వేలు బయటకు వస్తున్నాయి.చాలా వరకు సర్వేలలో ఫలితాలు తారుమారు అవుతాయని వెల్లడించినా అధికశాతం మాత్రం వైసీపీకే అధికారం దక్కుతుందని తెలుపుతున్నారు.ఇదిలా ఉండగా గతంలో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన కత్తి మహేష్ కూడా ఓ సర్వే చేపట్టారట.

ఈ క్రింది వీడియో చూడండి

తాను ఇప్పుడున్న పరిస్థితుల మేర మొత్తం 60 నుంచి 65 అసెంబ్లీ స్థానాలు అలాగే పూర్తిగా 25 పార్లమెంటు స్థానాలలోనూ పర్యటించానని ఎక్కడకి వెళ్లినా సరే ప్రజలు అంతా సమూలమైన మార్పును కోరుకుంటున్నారని తన విశ్లేషణలో అర్ధమయ్యిందని కత్తి తెలిపాడు.అలాగే ఈసారి చంద్రబాబు అనుకున్నట్టుగా ఏమి జరగదని అతను ఊహించని ఫలితాలు రాబోతున్నాయని వెల్లడించారు.జనం వారి కంటే తెలివిగా ఆలోచిస్తున్నారని చివర్లో ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పెంచిన ఫించన్లు చంద్రబాబును కాపాడుతాయి అనుకుంటే అది వారి భ్రమే అని వారు కత్తి తెలిపాడు.తాను చేపట్టిన సర్వే ప్రకారం ఈసారి జగన్ ఎలాంటి అడ్డంకులు లేకుండా 100 నుంచి 110 స్థానాలు పక్కాగా గెలుపొందుతారని కత్తి తేల్చి చెప్పేసాడు.మరి కత్తి చెప్పిన జోస్యం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.