జీ.వీ హ‌త్య‌లు చేశారు బొల్లా తీవ్ర విమ‌ర్శ‌లు

352

గుంటూరు జిల్లాలో వినుకొండ సెగ్మెంట్లో రాజ‌కీయాలు ఎప్పుడూ డిఫ‌రెంట్ గా ఉంటాయి.. ప్ర‌స్తుత‌ ఎమ్మెల్యే జీ.వి ఆంజ‌నేయులుకు జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించి జిల్లా వ్య‌వ‌హారాలు కూడా చూసుకోమ‌నే అంత‌లా చ‌నువు జీవీతో బాబుకు ఉంది ..దూళిపాళ్ల లాంటి సీనియ‌ర్ కు కాద‌ని జీవికి బాధ‌త్య‌లు ఇస్తారు బాబు.. గుంటూరు జిల్లాకు సంబంధించి అన్నీ ఆయ‌నే చేసుకుంటారు..2014 ఎన్నిక‌ల్లో న‌న్న‌ప‌నేని సుధ వైసీపీ త‌ర‌పున పోటీ చేసి, ఇక్క‌డ ఓట‌మి చెందారు..

Image result for జీ.వి ఆంజ‌నేయులు

త‌ర్వాత ఇక్క‌డ వైసీపీ త‌ర‌పున ఇంచార్జ్ అయ్యారు వినుకొండ‌కు చెందిన బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు.. ఇక్క‌డ సెగ్మెంట్లో వైసీపీ గెలుపు కోసం నిరంత‌రం కృషిచేస్తున్నారు.. అయితే పారిశ్రామిక వేత్త‌గా ఉన్న జీవీపై ఇటు పారిశ్రామిక వేత్త అయిన బొల్లాకు ట‌ప్ వార్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సెగ్మెంట్లో ఉంటుంది అనేది ఎవ‌రికైనా ఇట్టే ఇక్క‌డ చూస్తే తెలిసిపోతుంది… వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, కామెంట్లు చేశారు బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు…ఆయన స్మగ్లర్లకే డాన్‌ అని విమ‌ర్శించారు.. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు.

Image result for బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు

వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు… భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంజ‌నేయులు లాక్కున్నారని అన్నారు.
ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనపై హత్య కేసు బనాయించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు పోలీసులపై ఆయన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. పోలీసులు పక్షపాతం లేకుండా ఈ కేసును విచారిస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆంజనేయులు ముగ్గురిని చంపినట్టు వినుకొండలో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.మొత్తానికి జీవిపై బొల్లా చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు తావిస్తున్నాయి.. ఇలా ఏ నాడు ఆయ‌న కామెంట్లు చేయ‌లేదు.. దీంతో ఇక్క‌డ పొలిటిక‌ల్ వార్ ఎలా ఉండ‌బోతోంది అని చ‌ర్చించుకుంటున్నారు.