బొజ్జ‌ల సుధీర్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్

308

ఏపీలో ఇప్పుడు వార‌సుల రాక వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున వార‌సులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు..2019లో జరుగనున్న ఎన్నికల్లో మరోసారి తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని గెలిపించాలని టీడీపీ యువనేత, ఒలంపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జల సుధీర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక మాజీ మంత్రిగా ఉన్న బొజ్జ‌ల ఈసారి పోటీ చేస్తారా లేదా అనే వార్త‌లు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి.. అయితే శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడిన ఆయన కుమారుడు సుధీర్ , తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికే టీడీపీ టిక్కెట్టు ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చిందన్నారు.

Image result for బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

టిక్కెట్టు విషయంలో తమకు ఎలాంటి సందేహాలు లేవన్నారు. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగా శ్రీకాళహస్తి టిక్కెట్టు ఇతరులకు ఇస్తారని ప్రచారం చేస్తున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలందరూ మరోసారి తమ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని సుధీర్‌రెడ్డి వివరించారు. తన తండ్రి హయాంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడం, జాతీయ విద్యాసంస్థలు నెలకొల్పడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీ, పంచాయతీశాఖ మంత్రి నారా లోకేష్‌ సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి చేయగలుగుతున్నామని చెప్పారు. తాజాగా సుధీర్ రెడ్డి చెప్పిన మాట‌లు చూస్తుంటే, ఇక ఆయ‌న తండ్రికి మ‌రోసారి అవ‌కాశం టీడీపీ ఇస్తుంది అనేది ఫైన‌ల్ అని అంటున్నారు పార్టీ నాయ‌కులు.