బాబును కీర్తిస్తున్న బీజేపీ ఎంపీ

447

బీజేపీ తెలుగుదేశం నాలుగేళ్లు క‌లిసి రాజ‌కీయంగా మిత్ర‌పార్టీలుగా ఉన్నా, ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో బీజేపీ మాట నిల‌బెట్టుకోలేద‌ని, ఇక బీజేపీతో క‌లిసేది లేదు అని తెలుగుదేశం బీజేపీకి క‌టీఫ్ చెప్పింది.. ఇక బీజేపీకి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎటువంటి షాక్ ఇస్తున్నాయో అలాగే తెలుగుదేశం కూడా షాక్ ఇచ్చింది .. ఎమ్మెల్సీ సోము వీర్రాజు నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్ వ‌రకూ, ఇటు బీజేపీ నాయ‌కులు తెలుగుదేశం పై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెట్టారు.. ఇక క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇవ్వ‌డంతో, ఆయ‌న కూడా తెలుగుదేశం పై ప‌లు విమ‌ర్శ‌ల బాణాలు ఇటు బాబు పై కూడా ఎక్కుపెట్టారు.

Image result for chandra babu

 

అయితే ప్ర‌త్యేక హూదా విష‌యంలో బీజేపీ వైఖ‌రికి నిర‌స‌న‌గా ప్ర‌తిప‌క్ష పార్టీల సాయంతో అవిశ్వాస తీర్మానం పెట్టింది స‌భ‌లో తెలుగుదేశం.. ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది… ఇక తెలుగుదేశం పార్టీని బీజేపీ ఎంపీలు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సెంట‌ర్ చేయ‌డం కూడా స‌భ‌లో తెలిసిందే. అయితే ఈ నాలుగేళ్లు తెలుగుదేశంతో సావాసం ఇంకా బీజేపీ ఎంపీలు మ‌ర్చిపోయిన‌ట్లు లేరు.. తెలుగుదేశం పార్టీపై మ‌రింత ప్రేమ చూపుతున్నారు.. అయితే స‌భ‌లో హూంమంత్రి రాజ్ నాథ్ కూడా బాబు మా మిత్రుడే అని అన్నారు.. అందుకే ఇక్క‌డ నాయ‌కులు కూడా ఆయ‌న అంటే ఏమీ లేదు మేము అన‌కూడ‌దా అనేలా ఉన్నారు.

Image result for గోక‌రాజు గంగ‌రాజు

తాజాగా న‌ర‌సాపురం బీజేపీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, కేంద్ర, రాష్ట్రాలకు ఈ ఇద్దరూ అవసరమేనని అన్నారు… 24 గంట‌లు రాష్ట్ర అభివృద్ది కోసం బాబు పాటుప‌డుతున్నారు అని కీర్తించారు.. మొత్తానికి తెలుగుదేశం పై ప్రేమ మ‌మకారం ఇంకా ఎంపీల‌కు బాగానే ఉంది అని, బీజేపీ నాయకుల చ‌ర్య‌పై ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.. అయితే ఇటుప్ర‌త్యేక హూదా విష‌యంలో మాత్రం బీజేపీ త‌న వెర్ష‌న్ చెప్పేసింది.. ఇక తెలుగుదేశం వైసీపీ ఎటువంటి రాజ‌కీయ పావులు క‌దుపుతాయో చూడాలి.