కాంగ్రెస్ లో చంద్ర‌బాబు కోవ‌ర్ట్

342

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలుపుకోసం ఇటు తెలంగాణ‌లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు త‌మ‌కు తోచిన విధంగా రాజ‌కీయాలు చేస్తున్నాయి.. ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు టీఆర్ఎస్ రావ‌డంతో, అనుకోకుండా ఎన్నిక‌ల‌కు సిద్దం అయిపోయారు ఇటు కాంగ్రెస్ నాయ‌కులు, ఇక కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ‌లో అంద‌రూ చ‌ర్చించుకునేది ఒక‌టే, కేవ‌లం ఎమ్మెల్యేల సంఖ్య క‌న్నా సీఎం అభ్య‌ర్దులు సంఖ్య ఎక్కువ‌గా ఈ పార్టీలో ఉంది అని అంటారు నిజంగా టి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇటువంటి ప‌రిస్దితే క‌నిపిస్తోంది.

Image result for revanth reddy

తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇక పొత్తుల గురించి కూడా చ‌ర్చ జ‌రుగుతోంది…అయితే మ‌రో మ‌హాకూట‌మి తెలంగాణ‌లో క‌నిపిస్తుంది అనేది తెలిసిందే.. గులాబీ పార్టీని ఓడించేందుకు ఇటువంటి ఎత్తులు వేస్తున్నారు అనేది అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు …ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ప్లాన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరారు అని ఇప్ప‌టికీ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇక ఆయ‌నకు విష‌యంలో ఓటుకు నోటు కేసు టీఆర్ ఎస్ పార్టీ విడిచిపెట్ట‌క‌పోవ‌డం ఇవ‌న్నీ వినిపిస్తూనే ఉంటాయి.

Image result for revanth reddy

తాజాగా కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డిపై బీజేపీ కూడా విమ‌ర్శ‌లు స్టార్ట్ చేసింది… కాంగ్రెస్‌లో చంద్రబాబు కోవర్ట్ రేవంత్ రెడ్డి అని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని విమర్శిస్తే పెద్దనాయకుడు అవుతానని రేవంత్‌రెడ్డి భ్రమపడుతున్నారని, మోదీని విమర్శించే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. మరోవైపు అమిత్‌షా ఒక్కసారి రాష్ట్రానికి వస్తేనే కాంగ్రెస్‌ వణికిపోతోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి తెలంగాణ‌లో ఎన్నిక‌ల హీట్ పార్టీల్లో స‌రికొత్త వార్ కు కార‌ణం అవుతోంది.