చంద్రబాబుకి బిగ్ షాక్ 15 మంది వరుసపెట్టి బీజేపీలోకి జంప్

145

తెలంగాణలో కారు పార్టీ మినహా ఏ పార్టీ జోరుమీద లేవు కాంగ్రెస్ పార్టీ ఇఫ్పటికే చతికిల పడింది ఇక తెలుగదేశం పార్టీ అసలు ఎలంటి పరిస్దతిలో ఉందో తెలుసుకోవచ్చు..అలాగే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున ఇప్పుడు ఆ పార్టీకి నేతలు ఎవరూ మిగలలేదు మరో ఐదు సంవత్సరాల తర్వాత అయినా అక్కడ తెలుగుదేశం పుంజుకుంటుంద అని ఎవరూ హామీ ఇవ్వలేకపోతున్నారు అలాగే ఏపీలో కూడా ఇఫ్పుడు ప్రతిపక్షంలో ఉంది టీడీపీ. ఇక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇవ్వలేకపోతోంది.అలాగే టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులుకూడా తెలుగుదేం కాంగ్రసె్ లను పెద్దగా పట్టించుకోవడం లేదు ఈ సమయంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గాలాం వేస్తోంది ఇఫ్పటికే కిషన్ రెడ్డికి కూడా ఇక్కడ కేంద్రంలో పదవి ఇచ్చింది నాలుగు ఎంపీ స్దానలు గెలుచుకున్న బీజేపీ తెలంగాణ పాలిటిక్స్ లో కాషాయం మార్క్ చూపిస్తోంది అని చెప్పాలి.

Image result for chandra babu

ఈ సమయంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఖాళీ చేయాలన్న పథకంలో భాగంగా భారతీయ జనతాపార్టీ నేతల చేరికలకు పచ్చజెండా ఊపింది. అందుకే టీడీపీ నేతలను పెద్ద సంఖ్యలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 18వ తేదీన టీడీపీ నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో చేరనున్నారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుతో పాటు అనేకమంది దాదాపు 15 మంది నేతలు ఈ సందర్భంగా కమలదళంలో చేరనున్నారు. చంద్రబాబుకి ఎంతో సన్నిహితంగా ఉండే నేతలు జంప్ అవుతున్నారు అనేది ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్న మాట, ఏపీలో టీడీపీకి నలుగురు రాజ్యసభ సభ్యులు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది అని నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

ఈ కార్యక్రమం కోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ సభకు ఏర్పాట్ల చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన చాలామంది నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్‌.దీపక్‌రెడ్డి, శోభారాణి, గడిలా శ్రీకాంత్‌గౌడ్‌, మల్లేశం,పాల్వాయి రజనీకుమారి, సామా రంగారెడ్డి, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కుమారుడు.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కొనేరు చిన్ని తదితరులు బీజేపీలో చేరనున్నారు.

Image result for chandra babu

తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా పావులు చురుగ్గా కదుపుతోంది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. హైదరాబాద్ నుంచే పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోనున్నారు. అయితే తెలంగాణలో ఎమ్మెల్యే షెగ్మెంట్ విషయానికి వస్తే రాజాసింగ్ ఒక్కరూ ఎమ్మెలయేగా ఉన్నారు మరో నాలుగు సంవత్సరాలు తెలంగాణలో మంచి పోరాటం చేసి అధికారంలోకి రావాలి అని చూస్తోంది కమలం పార్టీ అంుదకే సీనియర్ లీడర్లను పార్టీలో చేర్చుకునుందేకు సిద్దం అయింది. ఇటు కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి వలసన జోరు ఆగస్టు నుంచి ఉంటుంది అని చెప్పడానికి కూడా ఇదే ప్రధాన కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.