బిగ్ బ్రేకింగ్ : భీమవరంలో షాకింగ్ రిజల్ట్స్ తప్పవా..?

227

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఈసారి ఎవరు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటారో అన్న అంశంతో పాటు మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా ఉంది.తాను పోటీ చేస్తున్న గాజువాక మరియు భీమవరం నియోజకవర్గాల్లో గెలుపు పట్ల తీవ్ర ఆసక్తి నెలకొంది.అయితే గాజువాకలో పవన్ గెలుస్తారేమో కానీ భీమవరంలో మాత్రం పవన్ కు ఖచ్చితంగా గట్టి పోటీ తప్పేలా లేదు అని అనిపిస్తుంది.

Image result for pawan kalayan

అక్కడ పవన్ కు పోటీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అలాగే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ లు ఉన్నారు.వీరిలో పవన్ మరియు గ్రంథి శ్రీనివాస్ ల మధ్య మాత్రం భీకర పోరు తప్పదని అక్కడి ప్రజలే వెల్లడించారు.అలా అని అక్కడ పవన్ వేవ్ ను కూడా తక్కువ అంచనా వేస్తే పొరపాటే అవుతుంది.పవన్ అక్కడ ఎక్కువగా పర్యటించకపోయినా సరే పవన్ గెలుపు కోసం అతని అభిమానులు గట్టిగానే కష్టపడ్డారు.అలాగే వైసీపీ అభ్యర్ధికి కూడా క్షేత్ర స్థాయి నుంచి మంచి పట్టు ఉండడంతో గెలుపు ఎవరి సొంతం అవుతుందని చెప్పడం కష్టమే అవుతుందని విశ్లేషకులు ఇన్ని రోజులు అనేవారు.

ఈ క్రింది వీడియో చూడండి

కానీ తాజా సమాచారం ప్రకారం ఎక్కడ ఎవరు గెలుస్తారు అన్న విషయంపై గట్టిగానే బెట్టింగులు జరుగుతున్నాయట.ముఖ్యంగా పవన్ గెలుపు పైనే జరుగుతున్నాయని సమాచారం.పవన్ అక్కడ 20వేల ఓట్ల మెజార్టీ కైవసం చేసుకుంటారని ఒక వర్గం అంత సీన్ లేదు అని మరో వర్గం జోరుగా బెట్టింగులు జరుపుతున్నారట.అక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో 20వేల మెజార్టీ వచ్చిందంటే అది షాకింగ్ అనే చెప్పాలి.దీని వల్ల అక్కడ షాకింగ్ రిజల్ట్స్ తప్పవని విశ్లేషకులు అంటున్నారు.మరి అక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారో చూడాలి.