జగన్ కి షాక్ ఇచ్చిన భూమా అఖిల ప్రియ

252

ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు.. మంత్రి వర్గం ఏర్పాటు చేసుకుని పలువురు బెస్ట్ ఉద్యోగులను నియమించుకుని పరిపాలనలో ముందుకు వెళుతున్నారు జగన్. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మాత్రం దారుణమైన పరాభవం చూసింది, అలాగే జనసేన పార్టీ కూడా కేవలం ఒకే ఒక స్ధానాన్ని గెలుచుకున్నాడు.. టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది.. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది.

Image result for akhila priya

అయితే 2014 ఎన్నికలలో ఓటమి పాలైనా వైసీపీ ఈ సారి మాత్రం భారీ మెజారిటీతో విజయం సాధించింది.. అయితే 2014లో వైసీపీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారు పార్టీ ఫిరాయించినా ఇప్పుడు వారికి ఎన్నికల్లో గెలుపు రాలేదు..అయితే అందులో భూమా అఖిల ప్రియ కూడా ఒకరు..కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు కూడా పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.. ఇక వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్ళిన భూమా నాగిరెడ్డి కుమార్తె, అఖిలప్రియకు టీడీపీలో మంత్రి పదవి కూడా లభించింది.

ఈ క్రింద వీడియోని చూడండి

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికలలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ తరపున పోటీ చేయించి గెలిపించుకున్నారు. అయితే ఈ సారి జరిగిన ఎన్నికలలో మాత్రం వీరిద్దరు ఓడిపోవడం, ఇక టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా కనపడకపోవడంతో తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుందట. అయితే వైసీపీలోకి ఈమె ఎంట్రీకి కొన్ని అడ్డంకులు ఎదురవ్వడంతో బీజేపీ వైపు చూస్తున్నారట. అయితే బీజేపీ నేతలు ఈమెకు ఇదివరకే ఓక ఆఫర్ కూడా ప్రకటించారు. ఆళగడ్డ, నంద్యాల అసెంబ్లీ స్థానాలతో పాటు నంద్యాల ఎంపీ టికెట్ కూడా మీ ఫ్యామీలీకే ఇస్తామని అంతేకాకుండా కేంద్రంలో మంచి పదవి కూడా ఇస్తామని చెప్పారట. అయితే అటు టీడీపీలో ఉండలేక, ఇటు వైసీపీలోకి ఎంట్రీ దొరకక బీజేపీలోకి వెళ్ళడానికి సిద్దమైపోయారట. అయితే బీజేపీ నేతలతో చర్చించి తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వాలని కోరిందట మాజీ మంత్రి అఖిలప్రియ. అయితే దీనిపై బీజేపీ అధిష్టానంతో మాట్లాడి చెబుతామని పక్కాగా అనే విషయాన్ని మాత్రం తెలపడంలేదట. మరీ భూమా అడిగినట్టు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చి ఆమెను బీజేపీలో చేర్చుకుంటారా లేక మరే పదవైనా ఇస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది… మొత్తానికి ఈసారి తెలుగుదేశం పార్టీ ఓటమితొ కనివిని ఎరుగని రీతిలో ఆపార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారు.. సో మరికొన్ని రోజుల్లో టీడీపీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.