బాబు కేబినేట్ నుంచి అఖిలప్రియ అవుట్…?

491

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు మరోసారి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి…ఎన్నికలకు మరెంతో సమయం లేదు..ఈ టైం లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లో ముస్లిం లకు ఒక మంత్రి పదవిని కట్టబెట్టి వారిని ఉద్దరించినట్టు బిల్డప్ ఇచ్చే ఉద్దేశ్యం కనిపిస్తోంది..ప్రత్యేకించి బిజెపి తో తెగదెంపులు చేసుకున్న ఈ సమయంలో ముస్లిం లకు మంత్రి పదవిని కట్టబెట్టి చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటం మొదలు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి…

ఇప్పుడు జరగబోయేది కేబినేట్ విస్తరణ కాదు…పునర్వ్యవస్థీకరణ అని సమాచారం అందుతోంది..ఈ నేపధ్యంలో చేరికలే కాదు తీసివేతలు కూడా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..మరి ఎవరి మంత్రి పదవికి ఎసరు పెడతారు మన ముఖ్యమంత్రి వర్యులు అని ఆలోచిస్తే ఆ జాబితాలో మొదట భూమా అఖిల ప్రియ ఉంటుందని సమాచారం..అఖిలప్రియకు చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవిని ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బాబు పెట్టిన ఒత్తిడికి తాళలేక భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పాలయితే… ఎలాగూ నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయనే లెక్కలతో, సానుభూతిని వాడుకోవచ్చని చంద్రబాబు నాయుడు అఖిలప్రియకు మంత్రి పదవిని ఇచ్చాడు.

తన తండ్రి మరణిస్తే అందుకు కారణం చంద్రబాబే అవుతాడని హెచ్చరించిన భూమా అఖిలప్రియ ఎంచక్కా బాబు కేబినెట్లో మంత్రి అయ్యింది. అది కూడా తండ్రి చనిపోయాకా. ఇప్పుడైతే అఖిలప్రియతో బాబుకు దాదాపుగా అవసరం తీరిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మంత్రిగా కూడా అఖిలప్రియ పనితీరు ఎలా ఉందో ప్రజలు కూడా చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అఖిలను తప్పించినా అడిగే వారు ఉండరనే కాన్ఫిడెన్స్ చంద్రబాబుకు ఎలాగూ ఉండనే ఉంది…