ఆర్టికల్ 370 రద్దు.. ఇండియాకి ఎన్ని లాభాలో తెలుసా

186

కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్‌ 370పై మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడంతో ఇకపై ఆ రాష్ట్రంలో ప్రధాన మార్పులు జరగబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఇంతకు ముందు వరకూ కశ్మీర్‌కు ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉండేవి.. ఇకపై ఎలా మారబోతున్నాయి అంటే.. మొత్తం మార్పులు ఆ స్టేట్ లో కనిపించనున్నాయి.

Image result for ఆర్టికల్ 370 రద్దు.

జమ్మూకశ్మీర్‌ కు ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉండవు.అక్కడ ప్రజలకు ఇకపై ఏక పౌరసత్వమే ఉంటుంది. జమ్మూకశ్మీర్‌ అమ్మాయి ఇతర రాష్ట్రం లేదా దేశ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు.ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే ఆర్టికల్‌ 360, సమాచార హక్కు చట్టం ఈ రాష్ట్రానికి కూడా వర్తిస్తాయి. ఇతర రాష్ట్రాల వారు కూడా జమ్మూకశ్మీర్‌ ప్రజల ఆస్తులు, భూములు కొనవచ్చు.కశ్మీర్‌లో మైనారిటీలకు 16శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఇకపై రాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి ఐదు సంవత్సరాలుగా మాత్రమే ఆరు సంవత్సరాలు కాదు.కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండదు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టే కశ్మీర్‌లోని పంచాయతీలకు కూడా అన్ని హక్కులూ ఉంటాయి.ఉచిత నిర్భంధ విద్య నిబంధన ఇక్కడ కూడా అమలవుతుంది.

Image result for ఆర్టికల్ 370 రద్దు.

కేంద్రం ముందు అడుగు వేయడం మంచిది అని చెప్పాలి, అక్కడ డవలప్ మెంట్ కు ఇది ప్రధాన కారణం అవుతుంది… దీని ద్వారా 70 ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందానికి స్వస్థి పలికినట్లైంది. అమిత్ షా పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశ పెట్టగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసిందని ఆరోపించారు. అయితే దేశంలో మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించడం మాత్రం మోదీ సక్సెస్ గానే చెప్పాలి.కాశ్మీర్ నాయకురాలు మెహబూబా .. ఇది కాశ్మీర్ ప్రజలను భయపెట్టి కాశ్మీర్ ను స్వాధీనం చేసుకున్నారని అభిప్రాయపడింది. ఈ నిర్ణయం ద్వారా ప్రజల నుంచి తీవ్ర ప్రతి ఘటనను బీజేపీ ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఇంతక ముందు మెహబూబా పలు సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతీ తెలిసిందే. ఆర్టికల్ 370 ను ముట్టుకుంటే దేశం నుంచి విడిపోతామని చెప్పిన సంగతీ తెలిసిందే.కాని మోదీ సర్కారు మాత్రం ఆమె మాటలనే కాదు అసలు కశ్మీర్ నేతల మాటలు లెక్కచేయలేదు.అనుకున్నది సాధించారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

అయితే ఈ జమ్మూ కాశ్మీర్ కున్న ప్రత్యేక అధికారాలను రద్ధు చేయడం ద్వారా దేశానికీ ఎన్నో లాభాలున్నాయని చెప్పాలి. ఈ నిర్ణయం ద్వారా కాశ్మీర్ ఇప్పుడు దేశంతో పాటు కలిసిపోతుంది. పార్లమెంట్ వేసే చట్టాలన్నీ ఇప్పుడు కాశ్మీర్ కు వర్తిస్తుంది. తద్వారా కాశ్మీర్ లో అభివృద్ధిని సాధించవచ్చు. మిగతా ప్రాంత ప్రజలతో కాశ్మీర్లను ఏకీకృతం చేయొచ్చు. పెట్టుబడుల ద్వారా కాశ్మీర్ ను అభివృద్ధి పధంలో నడిపించవచ్చు. ప్రత్యేక అధికారాలు రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ .. భారత్ లోని మిగతా రాష్ట్రాల మాదిరిగా కేంద్రం అదుపులోకి పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా ఉగ్రవాదులను కంట్రోల్ లో పెట్టొచ్చు.ఇక్కడ అమ్మాయిలను పాక్ యువకులు పెళ్లి చేసుకున్నా ఇక్కడ పౌరసత్వం రాదు, ఉగ్రదాడులకు కుదరదు ఇదంతా నిజంగా బీజేపీ సక్సెస్ అనే చెప్పాలి. మరి కాంగ్రెస్ దీనిని విభేదించడం పై మీరేమంటారు మోదీ నిర్ణయం మంచిదేనా కాదా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.