బాబుగారి ఖ‌ర్చుల‌పై బెంగ‌ళూర్ మిర్ర‌ర్ క‌థ‌నం

385

దేశంలో విదేశీ ప‌ర్య‌ట‌న‌కు స‌ర్కారు బడ్జెట్ ని కోట్ల రూపాయ‌ల‌లో మంచినీళ్ల రూపంలో ఖర్చుపెడుతున్నారు నాయ‌కులు.. దీనిపై ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల‌లో నాయ‌కుల‌పై నేత‌లపై అధినేత‌ల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి… తాజాగా ఇలాంటి విమ‌ర్శ‌లు ఏపీలో కూడా వ‌స్తున్నాయి..ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇలాంటి దుబారా ఖ‌ర్చు ఎక్కువ చేస్తున్నారు అని అంటారు.. తాజాగా కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు నాయ‌కులు.. ఏపీ సీఎం స్వ‌దేశంలో కూడా ల‌గ్జ‌రీ కోసం ఖ‌ర్చులు చేస్తున్నారు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబుకు అయిన హోటల్‌ బిల్లు ఎంతో తెలుసా అక్షరాలా రూ. 8.7 లక్షలట. దీనిని కూడా ఏపీ ప్ర‌భుత్వం చెల్లించింది.. ఇలా కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు నేత‌ల‌కు ఖ‌ర్చు అవుతోంది అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా దీనిపై బెంగ‌ళూర్ మిర్ర‌ర్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది ఇప్పుడు ఇదే వైర‌ల్ అవుతోంది..

Image result for chandra babuఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన ఇతర రాష్ట్రాల నేతలు తమ హోటల్‌ ఖర‍్చును లక్ష, రెండు లక్షల మధ్యలో ముగించేస్తే, బాబుగారు.. రూ. 8లక్షలకు పైగా ఖర‍్చు చేశారట. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన నేతలకు అయిన ఖర‍్చుపై బెంగళూర్‌ మిర్రర్‌ ఓ కథనాన్ని ప్రచురించడంతో బాబు గారి దుబారా బయటపడింది. మ‌రి కార‌ణం ఏమిటో ?