బండ్ల‌గ‌ణేష్ కి ఫోన్ చేసిన కేటీఆర్.. అయినా మాట విన‌ని బండ్ల గ‌ణేష్

468

డిసెంబర్ 11.. ఉదయం 11 గంటల తరువాత నా ఇంటికి రండి. వచ్చేటప్పుడు షార్ప్‌గా పీక తెగే 7’O Clock బ్లేడ్ తీసుకుని రండి.. ఒకవేళ మహా కూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్.. రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్‌ గా వేసుకుంటావో నీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం’ అంటూ శపథం చేసిన బండ్ల గణేష్‌కి నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు… అస‌లు తెలుగుదేశం కూట‌మిగా కాంగ్రెస్ లో చేరిన త‌ర్వాత తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ కూట‌మి అధికారంలోకి వ‌స్తుంది అని ఈ నేత‌లు అంద‌రూ ప్ర‌చారం చేశారు. కాని తెలంగాణ‌లో సీన్ రివర్స్ అయింది.

Image result for bandla ganesh

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో దూసుకుపోతుంది. టీఆర్ఎస్ 93 స్థానాల్లో ముందంజలో ఉండగా.. మహా కూటమి 17 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే పీక కోసుకుంటా అంటూ ఛాలెంజ్ చేసిన బండ్ల గణేష్‌కు నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు. బండ్ల గణేష్ ఎక్కడ? 7’O Clock రెడీ. మీరు వస్తారా మమ్మల్ని రామంటారా? అని అని ట్వీట్లు చేస్తున్నారు. కేటీఆర్‌కి శుభాకాంక్షలు. కాని మా బాధ అంతా బండ్ల గణేష్ కోసమే. ఆయన ఆత్మహత్య చేసుకుంటారేమో అని అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Image result for ktr

‘ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నేవేశారు ఆనాడు యాంక‌ర్లు… లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం ఏంటి సార్? అసలు మీరెవరు? అధికారంలోకి రాకపోతే అనడానికి? ఆల్ట్రెడీ ఓటర్లు డిసైడ్ చేసేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జనం 70 నుండి 80 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు. ఇది ఫిక్స్. ఇక్కడ మీకు ఇంకో ట్విస్ట్ చెప్తున్నా వినండి. మాకు 80 సీట్లు రావడమే కాదు. టీఆర్ఎస్‌లో 15 నుండి 20 మంది గెలిస్తే వాళ్లు కూడా మా పార్టీలో చేరబోతున్నారు.

Image result for bandla ganesh

రాజకీయాలు చకచకా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం అనే క్వచ్ఛనే లేదు. జనం నాడి మాకు తెలుసు. జనం మాకోసం ఎదురు చూస్తున్నారు. బల్ల గుద్ది చెబుతున్నా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. వస్తుంది.. వస్తుంది దట్స్ ఇట్. ఇది ఆనాడు బండ్ల గ‌ణేష్ చేసిన ప్ర‌సంగాలు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఎంతైనా కమెడియన్‌ కదా.. ఏదో జోక్‌లు వేస్తాడులే అని లైట్ తీసుకోవడానికి ఇది సినిమారంగం కాదు గణేష్ గారు.. రాజకీయ రంగం ఏ విషయం అయినా సీరియస్‌గానే తీసుకుంటారు జనం. ఎందుకైనా మంచిది కాస్త 7’O Clock బ్లేడ్‌లకు దూరంగా ఉండండి. అంటూ కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్ప‌టికే గ‌ణేష్ కి ఫోన్ చేసి చెప్పార‌ట రాజ‌కీయాల్లో ఇలాంటివి కామన్ మీరు ఇలాంటి స‌వాల్స్ చేయ‌కండి అని చెప్పార‌ట‌. అయినా త‌న మాటపై పున‌రాలోచించుకుని వెనక్కి తీసుకుంటార‌ట బండ్ల గ‌ణేష్. మరి మ‌నం కూడా బండ్ల గ‌ణేష్ కి చెబుదాం ఇలాంటి కామెంట్లను పెద్ద ప‌ట్టించుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు అని.