బాల‌శౌరీ వైసీపీకి జోస్యం

410

ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెల‌వాలి అని అనుకుంటుంది.. అందుకు అనుగుణంగా పార్టీలో ప్ర‌ణాళిక‌లు ప్లాన్ లు వేసుకుంటారు.. ముఖ్యంగా పార్టీల నాయ‌కులు అధినేత‌లు చెప్పే మాట తాము అధికారంలోకి వ‌స్తే? ఇప్పుడు అధికారంలో ఉన్న ప్ర‌భుత్వానికి కంటే మంచిగా ప‌రిపాల‌న చేస్తాం అని చెబుతారు… నిజంగా వాస్త‌వంగా కొంద‌రు చెప్ప‌న మాట నిల‌బెట్టుకుంటారు.. కొంద‌రు మ‌ళ్లీ పాత ప్ర‌భుత్వాల‌ను మ‌య‌మ‌రిపిస్తారు.. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండ‌టంతో ఇప్పుడు వైసీపీ జ‌న‌సేన ఈ టాక్ పైకి తీసుకువ‌చ్చాయి.

Image result for వల్లభనేని బాలశౌరి

తెలుగుదేశం ప్రభుత్వం పై ఇప్పుడు వైసీపీ జ‌న‌సేన ఘ‌రం ఘ‌రంగా ఉన్నాయి.. మాకు అవ‌కాశం ఇవ్వండి ఏపీని అభివృద్ది ప‌థంలో ముందుకు తీసుకువెళ‌తాం అని అంటున్నారు.. మ‌రి తాజాగా వైసీపీ మ‌చిలీప‌ట్నం పార్లమెంటరీ కన్వీనర్‌ వల్లభనేని బాలశౌరి జోస్యం చెప్పారు..వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, ఇది ప‌క్కా అని ఆయ‌న అన్నారు.. ఏపీలో జ‌గ‌న్ పాద‌యాత్ర ఎంతో అద్బుతంగా జ‌రుగుతోంద‌ని, అందుకే తెలుగుదేశం ప్ర‌జ‌ల‌ను ట‌ర్న్ చేయ‌డానికి కొత్త విష‌యాల‌ను లైన్ లోకి తీసుకువ‌స్తోంది అని ఆయ‌న విమ‌ర్శించారు.

Image result for వల్లభనేని బాలశౌరి

ఇక ఆయ‌న సీఎం అవుతారు అని తెలుగుదేశం వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోతుంది అని ఆయ‌న విమ‌ర్శించారు. అమ‌రావ‌తిని అద్బుతంగా నిర్మిస్తాం అని చెబుతూ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి, తెలుగుదేశం అమ‌లు చేయ‌లేని హామీలు ఇస్తోంది అని ఆయ‌న విమ‌ర్శించారు…పోలవరం వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మానస పుత్రిక అని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు…మొత్త్తానికి బాలశౌరీ చెప్పిన జోస్యం, ఆయ‌న చెప్పిన‌ది నిజంగా జ‌రుగుతుందా అని ఇప్పుడు పెద్ద చ‌ర్చ అయితే జ‌రుగుతుంది