కాంగ్రెస్ లో చేరిన బైరెడ్డి – ఆఫ‌ర్ ఏమిటంటే?

584

రాయ‌ల‌సీమ‌లో బైరెడ్డి ఫ్యామిలీకి ఓ ఫేమ్ ఉంది రాజ‌కీయంగా… ఆయ‌న రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ స‌మితి పార్టీ స్ధాపించారు.. ప్ర‌జలు ఆ పార్టీని ఆద‌రించ‌డం లేదు అని తెలుసుకుని, నంద్యాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఆయ‌న పార్టీని మూసేశారు.. ఇక ఆ స‌మ‌యం నుంచి ఆయ‌న తెలుగుదేశంలో చేరుతారు అని వార్త‌లు వినిపించాయి.. ఆయ‌న తన పాత‌గూడు అయిన తెలుగుదేశంలో చేరుతారు అని అనుకున్నారు.. అయితే బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎంట్రీకి అక్క‌డ జిల్లాలో ఉప ముఖ్య‌మంత్రి కే.ఈ కుటుంబం అడ్డుకుంటోంది… పోని వైసీపీలో చేరుదాం అని అనుకుంటే గౌరు ఫ్యామిలీ ఆయ‌న ఎంట్రీపై అడ్డంకులు పెట్టారు.

Image result for byreddy rajasekhar reddy
ఇక ఆయ‌న ఫ్యామిలీకి చెందిన సోద‌రుని కుమారుడు మాజీ మంత్రి శేషశయనారెడ్డి మనవడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఇటీవ‌లే వైసీపీలో చేరారు..ఈ స‌మయంలో బైరెడ్డి కూడా తెలుగుదేశంలో చేరుతారు అని అనుకున్నారు కాని… ఆయ‌న ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ గా ఉన్నారు… పైగా ఆయ‌న సీటు విష‌యంలో కూడా టీడీపీ నుంచి హామీ రాలేదు.. దీంతో ఆయ‌నను బీజేపీ కూడా సంప్ర‌దించింది.. ఆయ‌న‌కు క‌ర్నూలు జిల్లా బాధ్య‌త‌లు ఇచ్చే ఆలోచ‌న చేసింది.. కాని ఆయ‌న ముందుకు రాలేదు …ప్ర‌త్యేక ప్యాకేజీ అలాగే రాయ‌ల‌సీమ డిక్ల‌రేషన్ ఏది కూడా ఆయ‌న‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి బీజేపీలోకి.

Image result for byreddy rajasekhar reddy

ఇక తాజాగా మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు..ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కోసం కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను తిరిగి మ‌ళ్లీ మ‌న గూటికి తీసుకురావాల‌ని తెలియ‌చేశారు.. ఇక తెలుగుదేశం వైసీపీ నుంచి ఆయ‌న‌కు అడ్డంకులు ఉండ‌టంతో బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో బైరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బైరెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి రాహుల్ సాదరంగా ఆహ్వానించారు. కర్నూల్‌లో త్వరలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించామన్నారు.

Image result for byreddy rajasekhar reddyకాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బైరెడ్డి ఇద్ద‌రూ క‌లిసి రాహుల్ వ‌ద్ద‌కు చేరుకున్నారు…. 2019 ఎన్నికలు మా ల‌క్ష్యం అని అన్నారు ఆయ‌న .. ఇక కోట్ల రాయ‌భారంతో బైరెడ్డి కాంగ్రెస్ లో చేరారు అని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి 50 ఎంపీ సీట్లు కూడా రావు అని విమ‌ర్శించారు ఆయ‌న‌… ఇక 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం త‌థ్యం రాహుల్ మా ర‌థ‌సార‌ధి అని ఆయ‌న అన్నారు…. మొత్తానికి ఆయ‌న కోరుకున్న ఎమ్మెల్యే సెగ్మెంట్లో కాంగ్రెస్ త‌ర‌పున బైరెడ్డికి సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. అదీ సంగ‌తి.