ఆ ఇద్ద‌రు ఫిరాయింపుల‌కు నో కేబినెట్ బెర్త్

417

ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఈ నెలాఖ‌రును జ‌రుగుతుంది అని వార్త‌లు అయితే వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ మంత్రి వ‌ర్గంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముందుకు వెళ్లే ఆస్కారం లేదు అని ఇప్ప‌టికే అనేక వార్త‌లు వినిపించాయి… దానికి బ‌లం చేకూర్చేలాగా ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా నిజం అని అనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీతో తెగ‌తెంపులు చేసుకున్నాక పార్టీ నుంచి ఇద్ద‌రు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు… అందుకే ఈ మంత్రి ప‌ద‌వులు ఇప్పుడు భ‌ర్తీ చేసే ఆలోచ‌న‌లో బాబు స‌ర్కారు ఉంది.. అందులో ఓ మంత్రి ప‌ద‌వి మైనార్టీల‌కు ఇవ్వ‌నుంది.

ఇక మైనార్టీల‌కు ఈ నాలుగు సంవ‌త్స‌రాలుగా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ని బాబు, తాజాగా రెండు ఖాళీల‌తో ఆ భ‌ర్తీ పూర్తి చేయాలి అని భావిస్తున్నారు.. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున గెలిచిన నాయ‌కులు కాకుండా వైసీపీ త‌ర‌పున గెలిచి పార్టీ ఫిరాయించిన ఇద్ద‌రు మైనార్టీ వైసీపీ ఎమ్మెల్యేల‌లో ఈ మంత్రి ప‌ద‌వి ఎవ‌రిలో ఒక‌రికి వ‌చ్చే అవ‌కాశం ఉంది అని అంటున్నారు.. ఇటు క‌దిరి ఎమ్మెల్యే అత్తార్ ఛాంద్ భాషా అలాగే జ‌లీల్ ఖాన్ ఇద్ద‌రిలో ఎవరికో ఒక‌రికి ఈ ప‌ద‌వి ఇస్తారు అని అంటున్నారు. ఇక నంద్యాల నాయకుడు ఎమ్మెల్సీ ఫ‌రూక్ కు కూడా ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు..

Image result for jaleel khan

ఇక్క‌డ ఇప్ప‌టికే న‌లుగురు ఫిరాయింపుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చినందుకే తెలుగుదేశం పార్టీని వైసీపీ టార్గెట్ చేసింది.. ఇప్పుడు వైసీపీ మ‌రింత స్ట్రాంగ్ గా మారింది.. సోష‌ల్ మీడియాలో ఆ ఎమ్మెల్యేకి మంత్రి ప‌ద‌వి ఇస్తే బీకాం ఫిజిక్స్ హైలెట్ చేస్తారు… బాషాకు ఇస్తే ఫిరాయింపు అనే అవ‌కాశం ఉంది…అందుకే మంత్రి ప‌ద‌వి ఫ‌రూఖ్ కు ఇచ్చే అవ‌కాశం ఉంది అని చ‌ర్చ జ‌రుగుతోంది… మ‌రి చూడాలి మైనార్టీ మంత్రి ప‌ద‌వి వ‌రించేంది ఎవ‌రికో.