ప‌క్కా ఆధారాల‌తో బాబు- లోకేష్ పై కేసు

327

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు అలాగే మంత్రి నారాలోకేష్ అవినీతిపై ఇప్పుడు పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది.. ముఖ్యంగా వైసీపీ బీజేపీ జ‌న‌సేన కాంగ్రెస్ ఇలా అంద‌రూ దీనిపైనే ఫోకస్ చేస్తున్నారు.. వీరి అవినీతి పై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు కూడా పార్టీలో జ‌రుగుతున్నాయి.. చంద్రబాబు మరియు లోకేష్ సహా ఇంకో నలుగురు వీరికి సహకారం అందిస్తున్నారు అని,వీరు అవినీతికి పాల్పడుతున్నారని న్యాయవాది శ్రవణ్ కుమార్ వారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ హై కోర్టులో కేసు పెట్టిన సంగతి తెలిసినదే,అయితే నిన్ననే ఈ కేసుకి సంబంధించి సరైన ఆధారాలు సమర్పించలేదని,కేసుని కొట్టివేశారు.

Related imageదీనిపై శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా తాను ఇంకా చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ మీద చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు తెలుపుతున్నారు.. ప్రయివేట్ కంపెనీల పేరిట వారికి వేల ఎకరాలు కేటాయించారని, దాని వెనుకున్న అంతరార్ధం ప్రకారం అక్కడి ఉద్యోగాలను భర్తీ చెయ్యాలని, దాని నిమిత్తం ప్రశ్నించగా వారు ఇప్పటికే 32లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారని తెలిపారు.ఇది ఏ మాత్రం వాస్త‌వం కాదు అని మ‌రి ఎందుకు ఉద్యోగాలు వ‌చ్చిన వారి జాబితా ఇవ్వ‌మంటే ఇవ్వ‌డం లేదు అని ఆయ‌న ప్ర‌శ్నించారు.Image result for lokesh naraదీనిపై ప‌క్కా ఆధారాలు సాక్ష్యాధారాల‌తో కోర్టుకు వెళతామ‌ని ఈసారి హైకోర్టులో పిటిష‌న్ మ‌రోసారి దాఖ‌లు చేస్తాను అని ప‌క్కా ఆధారాలు సంపాదించే ప‌నిలో ఉనాము అని, 25 వేల కోట్ల రూపాయ‌ల అవినీతి చేసి వీరు ఈ పాల‌న చేస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు. వారు చెప్పేది వాస్త‌వం అయితే ఎందుకు జాబితా బ‌య‌ట‌పెట్ట‌డం లేదు అని ఆయ‌న విమ‌ర్శించారు.