బాబు ప‌క్కా ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌

333

ఏపీలో ఎన్నిక‌ల హీటు పెరుగుతోంది అనే చెప్పాలి.. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్నారు. ఇక ఎన్నిక‌ల టీంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ముఖ్యంగా అనుకూల‌మైన నేత‌లు పార్టీలో విజయం వ‌రించే వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అలాగే అధికారుల‌కు కూడా స్ధాన చ‌ల‌నం క‌ల్పిస్తారు అని తెలుస్తోంది.. ఓసారి ఎన్నిక‌ల టీంతో బాబు చ‌ర్చ‌లు జ‌రిపి ఇక క‌స‌ర‌త్తు మొద‌లుపెడ‌తారు అని అంటున్నారు.

Image result for chandra babu
ముఖ్యంగా ఏపీలో పాల‌న భేషుగ్గా ఉంద‌ని చెబుతున్న తెలుగుదేశం పార్టీ, ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉండే అధికారుల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాల‌ని, వారికి పెద్దపీట వేయాల‌ని చూస్తోంది. స‌మ‌ర్ద‌వంత‌మైన నేత‌లు ఎంత ముఖ్య‌మో అధికారులు అంతే ముఖ్యం. అందుకే ఈ ఆలోచ‌న చేస్తోంది.. మూడేళ్లు దాటని అధికారుల‌కు స్ధాన చ‌ల‌నం క‌లిపించ‌నున్నారు.. ఇక శాఖ‌ల అధిప‌తుల‌కు కూడా పోస్టింగులు ట్రాన్స‌ఫ‌ర్లు ఉంటాయి అని తెలుస్తోంది.

Image result for chandra babu
వచ్చే ఎన్నికలకు సగర్వంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవసరమైన అధికారుల బృందంపై ముఖ్యమంత్రి, చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు అనేది ఇప్పుడు టీడీపీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్న అంశం. ప్రజలకు చేరువగా.. ప్రభుత్వ పథకాలను సమర్థంగా చేరవేయగలిగే జట్టు ఉండాలని ఆయన భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.. అధికారులు నిజాయితీగా ఉండడం కీలకం. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండడం కూడా ప్రధానమే. ఈ రెండూ ఉన్న జట్టుతో ముందడుగు వేస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని భావిస్తున్నారు. సో ఇప్పటికే దానికి అనుగుణంగా వ‌ర్క్ మొద‌లైంది అని అంటున్నారు.