బాబు పెట్రో కామెంట్ల పై సోష‌ల్ మీడియాలో ట్రెండ్

340

తెలుగుదేశం పార్టీ అధినేత పెట్రో పెరుగుద‌ల విష‌యంలో ఆందోళ‌న చేయడం విడ్డూరంగా ఉంది అని అంటున్నారు అంద‌రూ. ఇంతకీ విష‌యం ఏమిటి అని అనుకుంటున్నారా.. తాజాగా సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు త్వ‌ర‌లోనే పెట్రోల్ లీట‌ర్ వంద రూపాయ‌లు అయినా అవుతుంది ఏమో అని అన్నారు.. అయితే సీఎం ఇలా మాట్లాడ‌టం ఏమిటి అని అనుకుంటున్నారు అంద‌రూ.

Petrol price would soon touch 100, so will rupee against US dollar: Chandrababu Naidu

ఎందుకంటే మ‌న రాష్ట్రంలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై అదనపు బాదుడు బాదుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఏపీ ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబు నాయుడు అదనపు పన్నులు విధిస్తూ ఉన్నాడు. దీనిని ప‌క్క‌న పెట్టి పెట్రోల్ లీటర్ వంద‌రూపాయ‌లు అయినా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు అని అన‌డం విడ్డూరంగా ఉంది అని అంటున్నారు అంద‌రూ.

Image result for chandra babu

ఏపీలో పెట్ర‌లో డీజీల్ ధ‌ర‌ల‌కు మ‌రింత ప‌న్నులు బాదుతూ ఉన్నారు సీఎం చంద్ర‌బాబు.. ప‌క్క‌న ఉన్న క‌ర్నాట‌క త‌మిళ‌నాడు తెలంగాణ ఒరిస్సాలో కూడా లేని రేట్లు ఇక్క‌డ ఉన్నాయి.. ఇలాంటి సీఎం ఇప్పుడు పెట్రోల్ మంట గురించి మాట్టాడ‌టం హాస్యాస్ప‌దం గా ఉంద‌ని అంటున్నారు ప్ర‌జ‌లు, నాయ‌కులు. మ‌న రాష్ట్రం మీదుగా వెళ్లే లారీలు వాహానాలు కూడా ఇత‌ర రాష్ట్రాల్లో పెట్ర‌లో్ డీజీల్ ఫిల్ చేసుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో బాబు ఇటువంటి కామెంట్లు చేయ‌డం పై అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ముందు మ‌న రాష్ట్రంలో ఉన్న ప‌న్నుల రేట్లు త‌గ్గిస్తే అప్పుడు అవ‌త‌ల వారికి చెప్ప‌వ‌చ్చు అని అంటున్నారు ప్ర‌జ‌లు. ఇదే విష‌యంపై సోష‌ల్ మీడియాలో ట్రోల్ కూడా మొద‌లు పెట్టారు.