బాబుకు షాక్ ఇస్తున్న క‌న్న‌బాబు ?

416

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వ‌రుస షాక్ లు త‌గిలే ప‌రిస్దితులు క‌నిపిస్తున్నాయి.. అయితే అన్నీ నెల్లూరులో ప్ర‌ధాన సెగ్మెంట్ అయిన ఆత్మ‌కూరు చుట్టూనే జ‌రుగుతున్నాయి..అందుకే ఇక్క‌డ రాజ‌కీయం పై చ‌ర్చ జ‌రుగుతోంది…జిల్లాలో ఇప్ప‌టికే కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన వారికి అలాగే ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని వారికి ఓడిపోయిన వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చిఅందలం ఎక్కించారని, గ‌త ఎన్నిక‌ల్లో కష్ట‌ప‌డి పోటీ చేసి కేడ‌ర్ ని నిల‌బెట్టిన త‌మ‌కు ఏమీ ఇవ్వ‌లేదు అని నేత‌లు కొంద‌రు మ‌ద‌న‌ప‌డుతున్నారు.. అలాంటి వారు బ‌య‌ట‌ప‌డుతున్నారు.

Image result for chandr babu

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజ‌కవ‌ర్గానికి చెందిన టీడీపీ ఇన్ చార్జ్ క‌న్నబాబు పార్టీని వీడినట్లు తెలుస్తోంది.. ఆయ‌న రాజీనామాపై ఇప్ప‌టికే జిల్లా మంత్రుల‌కు తెలియ‌డంతో ఆయ‌న‌ని శాంతింప చేయాలి అని చూస్తున్నారు… ఆత్మ‌కూరు రాజ‌కీయాల్లో గ‌త ఏడాదిన్న‌ర కాలంగా క‌న్న‌బాబును దూరం పెడుతున్నారు.. అలాగే జిల్లాలో కార్య‌క్రమాల్లో కూడా స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదు.. ఇక వైసీపీ ఇక్క‌డ బ‌లంగా ఉండ‌టంతో ఆయ‌నకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గౌతం రెడ్డి పై గెలుపు క‌ష్టం అని భావిస్తున్నార‌ట‌.

నాలుగు సంవ‌త్స‌రాలుగా పార్టీకి ఇక్క‌డ సేవ‌లు చేస్తున్న క‌న్న‌బాబుని కాద‌ని అధిష్టానం, అలాగే మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఇక్క‌డ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు హీట్ పుట్టిస్తోంది..ఇంచార్జ్ గా మాజీ మంత్రి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిని మంత్రి సోమిరెడ్డి నియ‌మించారు… ఇక అస‌లే పొస‌గ‌ని నేత‌లు త‌న‌కు మ‌రింత పొగ‌పెట్ట‌డంతో ఆయ‌న వ‌ర్గానికి కూడా చెక్ పెడ‌తారు అని, ఆయ‌నకు ఎవ‌రూ జిల్లా నుంచి స‌పోర్ట్ నిల‌వ‌డం లేదు దీంతో ఆయ‌న రాజీనామా చేయాల‌ని చూస్తున్నారు.. అయితే ఆదాల విష‌యంలో వెన‌క్కి త‌గ్గితే ఆయ‌న రాజీనామా విష‌యంలో వెన‌క్కి తీసుకుంటారు అని తెలుస్తోంది.