టీడీపీలో ఉంటా పార్టీ మార‌ను ?

507

క‌డ‌ప‌జిల్లాలో ఆయ‌నే టీడీపీ ఎమ్మెల్యే …సింగిల్ గా జిల్లాలోఉన్న నేత, ఎమ్మెల్యే ఎవ‌రు అంటే ట‌క్కున చెబుతాం రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి అని, గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు విజ‌యం వ‌రించింది… టీడీపీ త‌ర‌పున ఆయ‌న ఒక్క‌రే జిల్లాలో గెలిచారు.. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కడ‌ప‌ జిల్లాలో తొమ్మిది స్ధానాలు వైసీపీ గెలిచింది.. అలాగే తెలుగుదేశం గెలిచిన సెగ్మెంట్ గా రాజంపేట నిలిచింది. ఇక వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో రాజంపేట‌లో ఓట‌మికి అనేక కార‌ణాలు ఉన్నాయి.. అయితే జ‌గ‌న్ వాటిని అధిగ‌మించారు అని అంటారు జిల్లా నేత‌లు.

Image result for chandra babuఇక ఆయ‌న పార్టీ మార‌తారు అని అనేక వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా.. ఇక తాజాగా ఆయ‌న పై గత 15 రోజులుగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త ప్ర‌చారం అవుతోంది.. ఆయ‌న పార్టీ మారుతున్నారు అని జిల్లా అంతా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి.. దీంతో క‌డ‌ప‌జిల్లా తెలుగుదేశం అధ్య‌క్షుడు నుంచి స‌మాచారం అందుకున్న సీఎం, వెంట‌నే మేడాతో మీటింగు ఏర్పాటు చేసుకున్నారు.. ఆయ‌న‌తో పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు.

తాను తెలుగుదేశంలోనే కొన‌సాగుతాను అని పార్టీ మారే ఆలోచ‌న‌లో లేను అని కేవ‌లం ప్ర‌తిప‌క్ష పార్టీలు చేస్తున్న ఆరోప‌ణ‌లు మాత్రమే అని మేడా తెలియ‌చేశారు.. మొత్తానికి జిల్లాలో వైసీపీలోకి ఆ ఎమ్మెల్యే వ‌స్తారు అని జ‌రుగుతున్న ప్రచారానికి ఎండ్ కార్డ్ ప‌డింది. ఎమ్మెల్యే మేడా ప్ర‌క‌ట‌న‌తో.