వైయస్ వివేకా హత్య కేసులో అరెస్టులు

229

వివేకానంద‌రెడ్డి హ‌త్య త‌ర్వాత ఆయ‌నని ఇంత కిరాతకంగా చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఏర్ప‌డింది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు…దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పేరిట ఓ లేఖ పెద్ద దుమారానికి కార‌ణం అయింది. కారు డ్రైవరు ప్రసాద్‌ తనను చచ్చిపోయేట్లు కొట్టాడని వివేకా పేరుతో రాసిన లేఖను ఆయన బంధువులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు అందించారు. ఇదే లేఖపై జగన్‌ స్పందిస్తూ గొడ్డలితో నరికి ప్రాణాలతో

కొట్టుమిట్టాడుతన్న వ్యక్తి ఎలా ఈ లేఖ రాయగలుగుతారని ప్రశ్నించారు. కారు డ్రైవరు ప్రసాద్ అలాగే, రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు ఆర్‌.సుధాకర్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ లేఖను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి అసలు వైఎస్‌ వివేకానే ఈ లేఖ రాశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి 11.30గంటలకు కారు డ్రైవరు ప్రసాద్‌ వివేకాను ఆయన నివాసంలో వదలి వెళ్లిపోతుండగా భోజనానికి డబ్బులివ్వగా తాను ఇంట్లోనే భోంచేస్తానని వెళ్లిపోయాడు. ఉదయం 5.30 గంటలకు పీఏ కృష్ణారెడ్డి వచ్చారు. 6.30గంటల ప్రాంతంలో వాచ్‌మేన్‌ వెనుక వైపు తలుపు తీసిన విషయాన్ని గుర్తించి కృష్ణారెడ్డికి వివరించారు. ఇద్దరూ వెళ్లి చూడగా బాత్‌రూంలో వివేకా విగత జీవుడై కనిపించాడు. అప్పుడే గుండెనొప్పితో కుప్పకూలిపోయి దెబ్బలు తగలడంతో రక్తస్రావమై వివేకా చనిపోయాడని బంధువులే ప్రాథమికంగా నిర్ధరించారు. బెడ్రూములో రక్తపు మరకలను కడిగేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇక రాత్రి నుంచి ఈ కేసుపై పోలీసులు సిట్ అధికారులు ప‌లు విష‌యాలు సేక‌రించి ఇంటిలో న‌లుగురు ప‌నిమ‌నుషులు ఉన్నారు అందులో ఒకామె వంట‌మనిషి ఇక మ‌రో వ్య‌క్తి వాచ్ మెన్ అని తెలుస్తోంది, అలాగే కారు డ్రైవ‌ర్ ప్ర‌సాద్ ని అదుపులోకి తీసుకున్నారు. వీరిని అన్ని విష‌యాలు అడిగి గెలుసుకుంటున్నారు. రాత్రి 11 గంట‌ల త‌ర్వాత ఏం జ‌రిగింది ఇంటిలో ఎవ‌రూ లేరా అస‌లు వాచ్ మెన్ ఎక్క‌డ‌కి వెళ్లారు ఇవ‌న్నీతెలుసుకుంటున్నారు, ఇక వంట మ‌నిషి రాత్రి స‌మ‌యంలో వంట వండి వెళ్లిపోతుంది అని మిగిలిన వారు కూడా ఇంటికి వెళ్లిపోతారు అని కేవ‌లం వాచ్ మెన్ ఒక్క‌రే ఇంటికి కాప‌లా ఉంటారు అని తెలుస్తోంది. డోర్ రోజు వేస్తారా వేయ‌రా, ఎందుకు నిన్న డోర్ నార్త్ సైడ్ తీసి ఉంది, ఆయ‌న ఉద‌యం ఐదు గంట‌ల‌కు లేస్తారు అని చెబుతున్నారు మ‌రి ఎందుకు ఆయ‌న‌ని ఉద‌యం లేప‌లేదు అని ప్ర‌శ్నిస్తున్నారు.

నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటరు రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవరు ప్రసాద్‌ను వదలి పెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి’ అని ముగింపు పలికారు. ఈ లెటరు అందుకున్న పోలీసులు కారు డ్రైవరు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని వెంట‌నే విచారించారు.. వంట మ‌నిషి వాచ్ మెన్ ఇద్ద‌రిన విడివిడిగా విచారిస్తున్నారు, ఇంట్లో ప‌నిమ‌నిషి ఉన్న స‌మ‌యంలో హ‌త్య ఎలా జ‌రుగుతుంది అని పోలీసులు అనుమానం ఉంది… రంగ‌న్న అనే వ్య‌క్తి వివేకా ఇంటి వ‌ద్ద రెండు సంవ‌త్స‌రాలుగా ప‌నిచేస్తున్నాడు ..మెయిన్ గేట్ కు ఎదురుగా ఆయ‌న పడుకుంటాడు మ‌రి ఇప్పుడు ఇక్క‌డ ఏం జ‌రిగింది అని, నాలుగు ఐదు రోజులుగా అనుమానితులు క‌నిపించారా అనేకోణంలో రంగ‌న్న‌ను ప్ర‌శ్నిస్తున్నారు పోలీసులు.