క్ష‌మాప‌ణ‌లు చెప్పిన విజ‌య‌సాయిరెడ్డి

388

పార్ల‌మెంట్లో చ‌ర్చ ఇప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో ఏదో విధంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.. ఇక నిన్న‌టి స‌భ‌లో అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.. బీజేపీ స‌భ్యుల సంగ‌తి ఎలా ఉన్నా, టీడీపీ- కాంగ్రెస్ స‌భ్యులు క‌లిసి ప్ర‌త్యేక హూదా పై గ‌ళం విప్పడం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

Image result for vijaya sai reddy

నిన్న‌టి రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు… దీనికి సంబంధించి రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు సభాముఖంగా క్షమాపణలు చెప్పారు.

Image result for venkaiah naidu

ఇక నిన్న స‌భ‌లో ప్ర‌త్యేక హూదాపై చ‌ర్చ చేప‌ట్టిన స‌మ‌యంలో, విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడారు ఆ స‌మ‌యంలో ఇక స‌భ స‌మ‌యం అయిపోయింది అని చైర్మ‌న్ ఆయ‌న‌ని నిలువ‌రించారు..ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఇలా చేస్తే సభ నుంచి వాకౌట్‌ చేస్తానని తీవ్రస్వరంతో హెచ్చరించారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. ఆయన వైఖరిపై అధికార, విపక్ష సభ్యులందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Image result for venkaiah naidu and vijayasai reddy

అలాగే స‌భ వాయిదా ప‌డిపోయింది.. ఇక నేడు పార్లమెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి విజ‌య్ గోయ‌ల్ ముందు నిన్న జ‌రిగిన ఘ‌ట‌న‌కు విజ‌య‌సాయిరెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాలి అన్నారు.. దీంతో ఆయ‌న మాట‌ల‌కు కాంగ్రెస్ అలాగే విప‌క్ష స‌భ్యులు అంద‌రూ మ‌ద్ద‌తు తెలియ‌చేశారు. ఇక తాను అలా ఎందుకు ప్ర‌వ‌ర్తించానో ఆయ‌న తెలియ‌చేశారు… ఇక ఈ విష‌యంలో ఎటువంటి మాట‌లు అక్క‌ర్లేదు త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు వ‌ద్దు అని చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు అన్నారు.. ఇక కాంగ్రెస్ నాయ‌కులు కూడా ఎందుకు దీనిపై విజ‌య‌సాయిరెడ్డి క్ష‌మాప‌ణ చెప్ప‌డం లేదు అనేస‌రికి విజ‌య‌సాయిరెడ్డి నిన్న‌టి ఘ‌ట‌న‌పై చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడికి క్ష‌మాప‌ణ చెప్పారు..