నిరుద్యోగుల‌కు ఏపీ స‌ర్కార్ స్వీట్ న్యూస్

794

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది.. ఈ కేబినెట్ భేటీలో మంత్రి వ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ భేటీలో కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు అన్ని శాఖ‌ల మంత్రుల ఆమోదంతో ..రాష్ట్రంలో 12.26 లక్షల మందికి ప‌త్రీ నెలా .1000 రూపాయ‌ల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేబినెట్ ఆమోదించింది.ఇక దీనికి పేరు కూడా ఫిక్స్ చేశారు.. ఈ ప‌థ‌కానికి యువ‌నేస్తం అనే పేరును ఖ‌రారు చేశారు పార్టీ నేత‌లు.. దీనికి ఆమోదం తెలిపారు అంద‌రూ.

Image result for unemployment people in india

ఇక త్వ‌ర‌లో ఏపీలో 20 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించారు.. దీనికి మంత్రి వ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. ఇక డీఎస్సీ ద్వారా మ‌రిన్ని ఉద్యోగాలు భ‌ర్తీ కానున్నాయి ఇక ఇత‌ర శాఖ‌ల్లో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించారు..అలాగే ఉడాకు మెడ్‌టెక్‌ జోన్ చెల్లించాల్సిన రూ.11 కోట్ల పన్నుకు మినహాయింపు ఇస్తూ మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది.

Related image

అలాగే విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పేరును వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీగా మార్పు చేశారు. ఇక ఎప్ప‌టి నుంచో కోరుతున్న నూతన చేనేత విధానానికి ఆమోదం తెలిపింది మంత్రి వ‌ర్గం. అలాగే ఫిజియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగల్న్ ఇచ్చారు.. కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది..

Image result for unemployment people in indiaమొత్తానికి కేబినెట్ నిరుద్యోగుల‌కు తాజాగా తీసుకువ‌చ్చిన ఈ యువ‌నేస్తం ప్ర‌జ‌ల్లోకి బాగా తీసుకువెళ్లాల‌ని కూడా తెలుగుదేశం స‌ర్కారు భావిస్తోంది… ఇటు నిరుద్యోగ యువ‌త‌కు పెద్ద ఎత్తున ఉద్యోగ అవ‌కాశాలు, అలాగే ప్ర‌భుత్వ కొలువుల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల అవ‌నున్నాయి అని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌నున్నారు అధికార పార్టీ నేత‌లు.