ప‌వ‌న్ కు కౌంట‌ర్ ఇచ్చిన ఏపీ మంత్రి

255

తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు చేస్తే ప‌వ‌న్ కు క‌లిసి వ‌చ్చేది ఏమిటి అనేది తెలియ‌డం లేదు.. ఇప్పుడు ప‌వ‌న్ అదే ప‌నిగా టీడీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం పై అంద‌రూ స‌ర్వ‌త్రా ఆలోచ‌న చేస్తున్నారు.. మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుగుదేశం నేత‌ల‌పై మంత్రుల‌పై తీవ్ర‌స్ధాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు, ఇక పార్టీ త‌ర‌పున కొంద‌రిని టార్గెట్ చేయ‌డం వారిపై ఇష్టం వ‌చ్చిన రీతిలో ఆరోప‌ణ‌లు చేయ‌డం తో ఇప్పుడు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Image result for Minister Jawahar

జగన్‌, బీజేపీని కాపాడటానికే చంద్రబాబుపై పవన్‌ విమర్శలు చేస్తున్నారని మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును గద్దె దించాలనే లక్ష్యం తప్ప ప్రజా సమస్యల పట్ల పవన్‌ కళ్యాణ్‌కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారనే పవన్‌ వ్యాఖ్యలు అర్ధరహితమని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్‌కు డబ్బులు తీసుకోవడం అలవాటైందని వ్యాఖ్యానించారు.

Image result for Minister Jawahar

ఇక్క‌డ మూడు రోజులు ప‌ర్య‌ట‌న చేసి ప‌క్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లి నీతులు చెప్పే ప‌వ‌న్ కేవ‌లం పార్టీ త‌ర‌పున నాయ‌కుడు మిన‌హా అత‌ను ప్ర‌జలకు చేసేది ఏమీ లేదు అని తెలుగుదేశం నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.ఇక మంత్రులు ఎమ్మెల్యేల‌పై టార్గెట్ చేసి ప్ర‌జ‌ల్లో పొలిటిక‌ల్ గా ఫేమ్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్న ప‌వ‌న్, సాధించేది ఏమీ లేదు అని ఆయ‌న అన్నారు.. మ‌రి ప‌వ‌న్ చేస్తున్న ప‌నిపై తెలుగుదేశం నేత‌లు చేస్తున్న‌కామెంట్లు ప్ర‌జ‌లు ఎలా అర్దం చేసుకుంటారో చూడాలి.