వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి మంత్రి సోదరుడు..జగన్ పాదయాత్రలో చేరిక..?

439

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతొ చేపడుతున్న పాదయాత్ర మంగళవారం విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించింది..ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ కు ఘన స్వాగతం పలికారు..ఉత్తరాంధ్ర లో జగన్ పాదయాత్ర ప్రవేశించడంతో తెలుగుదేశం నేతల్లో వణుకు మొదలయింది..జగన్ ప్రభంజనం ఇక్కడ అధికార పార్టీని ఒక కుదుపు కుదుపుతోంది.
ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం నేతలు జగన్ సమక్షంలో వైసిపి లో చేరారు..ఉత్త‌రాంధ్ర‌లోకూడా వైసీపీలోకి భారీగా వ‌ల‌స‌లు ఉండ‌నున్నాయి. మాజీ, తాజా ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు చాలామంది వైసీపీలో చేరెందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు స‌మాచారం.

ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీనీ బ‌ల‌హీన‌ర‌ప‌రిచేందుకు విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి రాజ వంశాన్ని వైసీపీ నుంచి టీడీపీలోకి తెచ్చామని మురిసిపోతున్న పసుపు పార్టీకి షాక్ తగిలే పరిణామం ఒకటి జరగబోతోంది. జిల్లా మంత్రి సుజయ క్రిష్ణ రంగా రావు సోదరుడు బేబీ నాయన తిరిగి వైసీపీ గూటికి చేరుతారని టాక్ నడుస్తోంది. ఈ పరిణామాలు టీడీపీలో ప్రకంపనలు స్రుష్టిస్తున్నాయి. మంత్రి కుటుంబం నుంచే వలసలు మొదలైతే ఇక పార్టీ నాయకులను ఆపడమెలా అన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది.