బిగ్ బ్రేకింగ్ : ఈ దెబ్బతో గంటా సంచలన నిర్ణయం.!

398

రోజురోజుకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయనే చెప్పాలి. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతీ రోజు ఏదొక రకంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇదిలా ఉండగా ఆ పార్టీకు చెందిన కీలక నేతలు అంతా ఇతర పార్టీలలోకి క్యూలు కట్టగా ఈ పార్టీలోనే ఉన్నవారు మాత్రం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీలో కీలక నేత అయినటువంటి గంటా శ్రీనివాసరావు ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకుంటారు అన్న వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు అధికారంలో ఉండే పార్టీలోనే ఉండే గంటా తన పలుకుబడితో తనకంటూ ఒక ప్రత్యేక పదవిని చేజిక్కించుకుంటారు. కానీ ఇప్పుడు అతను ఉన్న పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యిపాయే అయినా సరే గంటా ప్రతిపక్షానికి ఇచ్చే క్యాబినెట్ పదవి అయినటువంటి పీఏసీ ఛైర్మెన్ పదవిని తనకే చంద్రబాబు కట్టబెడతారని అనుకున్నారు కానీ అనూహ్యంగా చంద్రబాబు ఆ పదవిని పయ్యావుల కేశవ్ కు కట్టబెట్టినట్టు తెలిసింది. దీనితో గంటా చిన్నబోయారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Image result for ganta srinivasa rao

దీనికి ఫలితం ఎలా ఉంటుందో అన్న అంశం కూడా ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. చంద్రబాబు వేసిన ఈ దెబ్బతో గంటా కూడా వేరే పార్టీకు గంట కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రకరకాల ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అంటే ఏదో ఆశతో ఆగిపోయారు కానీ ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యిపోయింది కాబట్టి గంటా పార్టీ మారిపోయినా పెద్ద ఆశ్చర్య పడక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. చాలా రోజు క్రితం నుంచే గంటా శ్రీనివాస రావు బిజెపి నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, తాను బిజెపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని గంటా శ్రీనివాస రావు ఖండించారు. అయినప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు.

ఈ క్రింద వీడియోని చూడండి

బిజెపిలో చేరటానికి, తనతో పాటు మరికొంత మందిని చేర్చటానికి గంటా శ్రీనివాస రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరింత మంది ఎమ్మెల్యేలను కూడగట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం . ఫిరాయింపుల చట్టం నిబంధనలను అధిగమించడానికి మూడింట రెండు వంతుల మంది టీడీపీ ఎమ్మెల్యేలను కూడగట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాస రావుతో పాటు టీడీపీ శాసనసభ్యులు విశాఖ దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ , రేపల్లె ఎమ్మెల్యే అన్నంగి సత్యప్రసాద్ , కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి , వల్లభనేని వంశీ మోహన్, గన్నవరం తాము బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారంటూ వినిపిస్తున్న వార్తలతో ఏపీ టీడీపీలో కలకలం రేగింది.

Image result for ganta srinivasa rao

గంటా శ్రీనివాస రావు ఒక వ్యాపారవేత్త అయన ఇప్పటి వరకు మూడు పార్టీల్లో పనిచేశారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గంటా శ్రీనివాస రావు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు ఆయన కాంగ్రెసులోకి వెళ్లారు. ఆతర్వాత ఆయన తిరిగి టీడీపీలో చేరారు . ఇక ఈ నేపధ్యంలోనే గంతాకు పార్టీ మార్పు కొత్తేమీ కాదని గంటా శ్రీనివాస రావు బిజెపి జాతీయ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని, కొద్ది రోజుల్లో ఏదైనా జరగవచ్చునని బిజెపి నేతలు అంటున్నారు.చూడాలి మరి గంటా పార్టీ మారుతాడో లేదో. మరి గంటా పార్టీ మార్పు మీద వస్తున్నా వార్తల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.