డీలర్లను తొలగించం… స్టాకిస్టులు మారుస్తాం

175

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల ఫ్యూచర్ ఏంటి.. ప్రజాపంపిణీలో కీలకమైన ఈ వ్యవస్థను పూర్తిగా రద్దుచేసే దిశగా చర్చలు సాగుతున్నాయని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి.. డీలర్లను తొలగించే అంశంపై పౌర సరఫరాలశాఖ అధికారులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారని తెలిసింది. ఏపీలో 29,500 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వాళ్లలో చాలామంది 50 ఏళ్లకు పైగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా వారికి ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చి పని చేయిస్తోంది. కార్డుదారులకు పంపిణీ చేసే సరుకులపై ఇచ్చే కమిషన్ ఆధారంగా వీళ్లు జీవిస్తున్నారు. తమకు గౌరవ వేతనం ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఐతే డీలర్ల స్థానంలో సరుకుల పంపిణీని ఇకపై వాలంటీర్లు చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ వ్యవస్థ గందరగోళంలో పడింది. అయితే ఇప్పుడు ఈ విషయం మీద మంత్రి కొడాలి నాని స్పందించాడు.

Image result for డీలర్ల

ఆయన ఈ విషయం మీద మాట్లాడుతూ…. రాష్ట్రంలో 30 వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారని, వారిని తొలగించాలని ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు . అసెంబ్లీ లో రేషన్ డీలర్ల తొలగింపు అంశంపై చర్చ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టిమరి, రేషన్ డీలర్లను తొలిగిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు . రేషన్ డీలర్లను తొలగించమని, వారిని స్టాక్కిస్ట్ గా మారుస్తామని కొడాలినాని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో నే 42 మంది డీలర్లను తొలగించి, టీడీపీ నాయకులు వారి అనుచరులను పెట్టారని అన్నారు. ఒరిజినల్ రేషన్ డీలర్లు ఎవర్ని తొలగించమన్న కొడాలినాని, దొంగ దారుల్లో వచ్చిన వారు లేచిపోతారని పరోక్షంగా టీడీపీ ప్రభుత్వ హయాం డీలర్ షిప్ దక్కించుకున్న వారిని తొలగిస్తామని చెప్పకనే చెప్పారు. టీడీపీ నేతలు డీలర్లను నుండి డబ్బులు వసూలు చేశారని, గతం ప్రభుత్వం హయంలో రేషన్ డీలర్ల పై కేసులు కూడా పెట్టారన్నారు .

ఈ క్రింద వీడియోని చూడండి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపాధి కల్పిస్తారు తప్ప, ఎవర్ని డీలర్ గా తొలగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక, రేషన్ కార్డులను సమీక్షిస్తామని చెప్పారు. అర్హులైన వారికి త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్న ఆయన, రేషన్ డీలర్లు కార్డులు తమవద్దే పెట్టుకుని లబ్దిదారులకు సరకులు ఇవ్వకుండానే లెక్క చూపిస్తున్నారని అన్నారు . అటువంటి వారిపై దృష్టి సారించామని కొడాలి నాని హెచ్చరించారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రేషన్ డీలర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ డీలర్ల వ్యవస్థ కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో డీలర్లు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ సోమవారం నగరంలో ర్యాలీ చేపట్టారు. ఏపీ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా కోశాధికారి కాసినేని మధుసూధన్‌ హాజరై మాట్లాడారు. గ్రామ వాలెంటీర్‌ వ్యవస్థ వల్ల డీలర్ల వ్యవస్థ రద్దు అవుతుందని రేషన్‌ డీలర్లు మానసిక ఆందోళనకు గురయ్యారని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి డీలర్ల వ్యవస్థ యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఖాద్రీ పాషా పాల్గొన్నారు.