జగన్ మరో బంపర్ ఆఫర్ టైలరింగ్ చేసే వారికి 10000

97

ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. బీసీలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది అని అందరూ భావించారు. అలాగే తాజాగా సీఎం జగన్‌ మరో బంపర్‌ బొనాంజా ప్రకటించారు. రజక, నాయి బ్రాహ్మణ, టైలర్లకు ఆర్థిక సహాయంగా ఏడాదికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాతిపాదనకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. దీని ద్వారా పాదయాత్రలో వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చారు. నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పిన విధంగా వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ)లకు ఆర్థిక సహాయం అందించేందుకు కుటుంబ వార్షిక ఆదాయం, రేషన్‌ కార్డుల ఆధారంగా అర్హులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ. 1.01 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 83 వేలు సంవత్సర ఆదాయం కలిగి ఉన్న వారిని అర్హులుగా నిర్ణయించనున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సాధికార సర్వే ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఈ వృత్తులపై ఆధారపడి జీవిస్తూ అర్హత కలిగిన వారు 13 జిల్లాల్లో 30వేల మంది టైలర్లు, 1.92వేల మంది నాయీబ్రాహ్మణులు, 83 వేల మంది రజకులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే సాధికార సర్వే పూర్తి స్థాయిలో జరగలేదు. రీ సర్వే చేస్తే పూర్తి స్థాయిలో వివరాలు వచ్చే అవకాశం ఉంది. మరి రీ సర్వే నిర్వహిస్తారా లేదా అనేది వేచి చూడాలి. రజకులు, నాయీబ్రాహ్మణులకు వారి కార్పొరేషన్‌ల ద్వారానే అందించనున్నారు. టైలర్లందరికీ బిసి కార్పొరేషన్‌ ద్వారా అందిస్తామంటున్నా, బిసిలతో పాటు అనేక కులాలకు చెందిన వారు టైలర్‌ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మరి వీరందరికీ బిసి కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారా లేదా వారి కోసం ప్రత్యేకంగా మరో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తారా అనే అంశంపై స్పష్టత రావలసి ఉంది. ఈ అంశాలన్నింటినీ త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Image result for jagan

అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. పరిశ్రమల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాల కోసం జీవనోపాధి కల్పించే విధంగా చట్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీలో కూడా దీనిని ప్రతిపాధించి బిల్లు పాస్ చేయించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించింది.. ఈ విప్లవాత్మక చట్టానికి ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే శ్రీకారం చుట్టింది. ఇలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ అన్ని వర్గాల వారిని కలుపుకుపోతున్నారు అని చెబుతున్నారు ప్రజలు.. దాదాపు 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.