ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కుమారుడు mruthi షాక్ లో కెసిఆర్ చంద్రబాబు

526

ప్రముఖుల ఇళ్లలో వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగం నుంచి ఉన్న ప్రముఖులు చనిపోవడమో లేదా వారి కుటుంబ సభ్యులు చనిపోవడమో జరుగుతుంది. ఇప్పుడు ఒక మాజీ సీఎం కుమారుడు చనిపోయాడు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత భవనం వెంకట్రామిరెడ్డి కుమారుడు భవనం శ్రీనివాస్ రెడ్డి (57) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను హాస్పిటల్‌‌లో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ap former cm bhavanam son passed away due to heart attack

ఆదివారం సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. భవనం శ్రీనివాస్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సన్ షైన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గురవారెడ్డికి శ్రీనివాస్ స్వయానా బావమరిది. మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డికి శ్రీనివాస్ ఏకైక కుమారుడు. నలుగురు సంతానంలో ముగ్గురు అమ్మాయిలు. వీరిలో ఒకరైన భవానీని డాక్టర్ గురవారెడ్డి వివాహం చేసుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిదో ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకట్రామిరెడ్డి ఆ పదివిలో కేవలం ఏడు నెలలు మాత్రం కొనసాగారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన యూత్ కాంగ్రెస్ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా సీఎం స్థాయికి చేరుకున్నారు. తొలిసారిగా 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంజయ్య క్యాబినెట్‌లోనూ మంత్రిగా కొనసాగారు. తర్వాత, ఆయన నుంచే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఐదుగురు ముఖ్యమంత్రులను మార్చి భారీ మూల్యమే చెల్లించుకుంది. అయితే కాంగ్రెస్ నేతలు వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి శ్రీనివాస్ రెడ్డి మృతికి నివాళులు అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో ఆయన మృతికి నివాళి అర్పిద్దాం.