జనసేన మ్యానిఫెస్టో కాపీ కహానీ…యనమల

419

స్వాతంత్ర  దినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ మ్యానిఫెస్టో ను విడుదల చేసారు..ఈ మ్యానిఫెస్టో కాపీ కాట్ లా ఉందని ఆర్ధిక మంత్రి తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు..దీనిపై మంత్రి యనమల మాట్లాడుతూ.. పార్టీ 7 సిద్ధాంతాలుగా పేర్కొన్న అంశాలు కూడా కొత్తవేవీ కావని, కుల, మత సామరస్యం, భాషా సంస్కృతులు అన్నీ పాత అంశాలేనన్నారు. మచ్చుతునకలుగా పేర్కొన్నవన్నీ కాపీ తునకలే తప్ప కొత్తవేవీ లేవని ఎద్దేవా చేశారు…

కాపు రిజర్వేషన్ల అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేశామని, తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపామని చెప్పారు. తెదేపా ఎంపీలు దీనిపై పోరాటం చేస్తున్నారన్నారు. రేషన్‌కు బదులుగా నగదు బదిలీ అంశం కూడా కొత్తదేమీ కాదని, అవకాశాన్ని బట్టి బీసీలకు అదనంగా 5శాతం రిజర్వేషన్ల పెంపు అనడంలోనే అవకాశవాదం కనిపిస్తోందని దుయ్యబట్టారు. అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్‌ కూడా పాతదేనని, ఇప్పటికే బ్రాహ్మణ, వైశ్య కార్పొరేషన్లు తెదేపా పెట్టిందని బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయిస్తోందని గుర్తుచేశారు.