రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ నేరుగా బ్యాంకు ఖాతాలోకే 12500 ఎప్పుడంటే

258

రాష్ట్రంలోని లక్షల మంది కౌలు రైతులకు మేలు చేకూర్చే చరిత్రాత్మక బిల్లును శాసనసభ గురువారం సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆమోదించింది. ‘ఆంధ్రప్రదేశ్‌ పంట సాగుదారు హక్కుల బిల్లు–2019’పై సుదీర్ఘ చర్చ అనంతరం రెండు సవరణలతో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలోని 15.36 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరుగుతుంది. భూ యజమానితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఇచ్చే రూ.12,500 పెట్టుబడి సాయం అందుతుంది. భూ యజమానులకు ఈ బిల్లుతో ఎటువంటి నష్టం ఉండదు.

Image result for jagan

ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పంట సాగుదారు హక్కుల బిల్లు–2019ని సభలో చర్చకు ప్రవేశపెట్టారు. అయితే కౌలు రైతుల కోసం అద్వితీయమైన బిల్లును తెస్తున్న సమయంలో విపక్ష సభ్యుల తీరు సరిగా లేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పదేపదే విజ్ఞప్తి చేసినా వినకపోవడం, వాదోపవాదాలతో అడ్డుతగలడంతో విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయక తప్పడం లేదన్నారు. ఎవరి కోసమో సభను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేనన్నారు. శాసనసభను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రయోజనం కలిగించే అంశాన్ని అడ్డుకోవడం మంచిది కాదని సూచించారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా బిల్లుల్ని ఆమోదిస్తున్నారని ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసిస్తుంటే చర్చ జరగకుండా అడ్డుపడటం మంచి సంప్రదాయం కాదన్నారు.

Image result for jagan

అనంతరం మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగం తీవ్ర నిరాశ, నిస్పృహలతో మునిగి ఉన్న తరుణంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఆనందంగా ఉంద‌న్నారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 5 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే అరకొరగా సాయం అందుతోందన్నారు. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం కలుగకుండా కౌలు రైతులకు కేవలం 11 నెలల కాలానికి పంట మీద మాత్రమే హక్కు కల్పించేలా ఈ బిల్లును తెచ్చినట్లు వివరించారు. భూ యజమానులకు ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. పాత కౌల్దారి చట్టం విఫలమైన నేపథ్యంలో కొత్త చట్టం అవసరమైందని వివరించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కౌలు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. ఈ బిల్లుతో కౌలు రైతులకు కూడా పంట రుణం, పంటల బీమా, పెట్టుబడి సాయం, ఒప్పంద కాలంలో పంట నష్టపోతే పరిహారం తదితరాలు అందుతాయన్నారు. తమకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు కౌలురైతులు కృతజ్ఞతలు చెబుతున్నారని తెలిపారు. సభ్యుల ప్రసంగాల అనంతరం ఈ బిల్లు ఆవశక్యత, ముఖ్యాంశాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభకు వివరించారు. అనంతరం రెండు సవరణలతో బిల్లును సభ ఆమోదించింది.

ఈ క్రింద వీడియోని చూడండి

గత టీడీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గురువారం శాసన మండలిలో సంక్షేమ పథాకాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు తన పాలనలో రైతులను అన్ని విధాల మోసం చేశారని అందుకే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు పెద్ద పీట వేసిందని, వారి సంక్షేమానికి, అభివృద్దికి ప్రత్యేక వ్యుహంతో ముందుకు వెళుతోందని తెలిపారు. రైతుల రుణమాఫీకి నిధులు లేవన్న చంద్రబాబుకు పసుపు, కుంకుమకు మాత్రం నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదని, రైతుల కోసం కేటాయించిన 2వేల కోట్ల ఇన్‌ పుట్‌ సబ్సిడిని టీడీపీ ప్రభుత్వం ఎగ్గోట్టిందని ఆరోపించారు.

Image result for jagan and framers

అయితే తాము అధికారంలోకి రాగానే శనగ, పామాయిల్‌ రైతులను ఆదుకున్నామని, ఇప్పుడు ఈ నిధులను మంజూరు చేస్తున్నామని తెలిపారు. అలాగే రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామన్నారు. తమది రైతు ప్రభుత్వమని తెలిపారు. అదే విధంగా రైతుల కోసం ఏం చేయడానికైనా తాము ఎప్పుడూ సిద్దంగా ఉంటామన్నారు. కాగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని ఈ విషయం గురించి అధికారులు చెబుతున్న చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.