కరుణ ను పరామర్శించిన చంద్రబాబు…

371

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిఎంకె అధినేత కరుణానిధిని పరామర్శించారు…సనివారం ఉదయం చెన్నై చేరుకున్న బాబు నేరుగా కావేరీ ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న కరుణానిధిని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు..కరుణానిధి కుమారుడు స్టాలిన్, కూతురు కనిమొళి చంద్రబాబుతో కాసేపు భేటీ అయ్యారు. వారి సమక్షంలోనే కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు చంద్రబాబుకు వివరించారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సీనియర్ నేత వీరమస్తాన్‌రావు ఉన్నారు…

తీవ్ర అస్వస్థతతో జులై 27న కావేరీ ఆస్పత్రిలో చేరిన కరుణానిధి క్రమంగా కోలుకుంటున్నారు. రెండు రోజుల నుంచి అరగంట పాటు కుర్చీలో కూర్చోబెట్టి కరుణానిధికి ప్రత్యేక ఫిజియోథెరపీని వైద్యులు అందజేస్తున్నారు. కరుణానిధి పూర్తిగా కోలుకుంటున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు వైద్యులు బులిటెన్‌ను విడుదల చేశారు.